Monday, December 23, 2024

రేపు ప్రభుత్వ ఐచ్ఛిక సెలవు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ నెల 6వ తేదీన అరబియన్ సందర్భంగా ఐచ్ఛిక సెలవుదినంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించగా.. దానిని సవరిస్తూ 7వ తేదీగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రకటించారు. ఈ మేరకు సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ పేర్కొన్న కారణాల దృష్ట్యా బుధవారం బదులుగా 7వ తేదీన (గురువారం) అరబియన్ ఐచ్ఛిక సెలవు ప్రకటించారు. దీంతో అర్బాయిన్ జరుపుకునే ప్రాంతాల్లో రేపు సెలవు ఉండనుంది.

కాగా, మహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్ బలిదానానికి సంస్మరణగా 40వ రోజు షియా ముస్లింలు జరుపుకునే అర్బాయిన్ సందర్భంగా గతంలో ఈ నెల 6వ తేదీన ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ఇచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News