మేషం – ఆత్మసాక్షికి విలువనిచ్చి మున్ముందుకు సాగిపోతారు. మీ కష్టం వలన కార్యాలయంలో మీ సహ ఉద్యోగులకు కూడా ఉద్యోగ పరంగా చాలా మేలు జరుగుతుంది. మీరు నమ్మిన సన్నిహితుల పనితీరు మీకు నచ్చదు.
వృషభం – ప్రతి విషయానికి తగాదాలు పడే వారి విలువ చెప్పుకోదగిన స్థాయిలో మీకు చికాకు కలిగిస్తుంది. మీకు మీరుగా కొన్ని కఠినమైన బాధ్యతల నుండి తప్పుకుంటారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మ కంగా వ్యవహరిస్తారు.
మిథునం – స్థిరాస్తులు, లిటిగేషన్ వ్యవహారాలు పరిష్కరించి కొంత ప్రయోజనం పొందగలుగుతారు. అవగాహన లోపం వల్ల బంధువర్గం మిత్రవర్గం నష్టపోయి మిమ్మల్ని కూడా కొంతవరకు నష్టపరుస్తారు.
కర్కాటకం – స్నేహితులతో బంధుత్వం కలుస్తుంది. వృత్తి ఉద్యోగాలపరంగా పోటీదారులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ప్రతిస్పందించడం మంచిది కాదని గ్రహించండి.
సింహం – ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త వలన సంతోషం కలుగుతుంది. మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి.
కన్య – ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
తుల – ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం నకు నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు.
వృశ్చికం – ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. మీ వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంటారు.
ధనుస్సు – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం విషయం లో జాగ్రత్తలు అవసరం.
మకరం – అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం లభిస్తుంది.
కుంభం – ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పంలు కుదురుతాయి. అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ఆరోగ్యం వాహన విషయాలలో నిర్లక్ష్యం తగదు.
మీనం – వృత్తి – వ్యాపారాలలో సల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వివాదాలకు చాలా దూరంగా ఉండండి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు పొందుతారు.