మేషం – వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. మిత్రజన సహకారం లభిస్తుంది. శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఆర్థిక వ్యవహారాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి.
వృషభం – పనులకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ యొక్క రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం చేసుకుంటారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు.
మిథునం – వృత్తి ఉద్యోగ వ్యాపారాధి రంగాలలో ఓ మోస్తరుగా ఉంటుంది. పెద్దల సలహాలు సూచనలు మీకు పనిచేస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆశించిన ఫలితం దక్కుతుంది.
కర్కాటకం – కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించుకుంటారు. సానుకూల ఫలితాలను కూడా సాధిస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మనసు చెడు విషయాల వైపు మళ్ల కుండా జాగ్రత్తపడాలి.
సింహం – మంచి పనులు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువబడుతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు.
కన్య – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది.
తుల – కొందరి ప్రవర్తన శైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా మెలగడం చెప్పదగినది. మీదైన రంగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.
వృశ్చికం – ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఎన్నాళ్ళ నుంచి ఎదురుచూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది.
ధనుస్సు – క్రమశిక్షణకు ప్రాధాన్యతని ఇస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆధునిక కాలానికి తగినట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీ జీవనశైలి పై దృష్టిని సారిస్తారు.
మకరం – ఆదాయానికి తగినట్టుగా వ్యయం ఉంటుంది. ఎత్తి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. బంధువుల అండదండలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు.
కుంభం – వృత్తి-ఉద్యోగ వ్యాపారాధి రంగాలలో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా శ్రమించాలి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి.
మీనం – ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటాబయట ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి.