మేషం – ఆర్థిక సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. అనుకోని వ్యక్తులు తారసపడతారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.
వృషభం – వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. స్వల్ప ధన లాభం.
మిథునం – రాబడి పెరుగుతుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతానం నాకు నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. శుభవార్తలు.
కర్కాటకం – వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకొంటారు. దైవ చింతన కలిగి ఉంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.
సింహం – కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. రుణ వత్తిడులు తొలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
కన్య – ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. చర్చాగోష్టులలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగులకు బదిలీలు వుంటాయి.
తుల – కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. శ్రమకు తగిన లాభం పొందుతారు. వృధా ఖర్చులు ఎక్కువవుతాయి.
వృశ్చికం – నూతన ఆదాయం మార్గాలను అన్వేషిస్తారు. సాహసోపితమైన నిర్ణయాలు తీసుకుంటారు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
ధనుస్సు- నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుకుంటారు. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు చేయకండి. మొండి బాకీలు వసూలు అవుతాయి.
మకరం – నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. ప్రయాణాలు లాభిస్తాయి.ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. వివాదాలకు దూరంగా ఉండండి
కుంభం – దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది.కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.
మీనం – ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు.అనుకోని వ్యక్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. మీపై చెప్పుడు మాటలు చెప్పే వ్యక్తులు అధికమవుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225