మేషం – వ్యాపారులు కొన్ని నూతన ఒప్పందాలు ఖరారు చేసుకుంటారు. మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
వృషభం – సమాజంలో శుభ ఖర్చుల ద్వారా మీ కీర్తి పెరుగుతుంది. మీ ప్రభుత్వ పనిని కొంతకాలం వాయిదా వేస్తే అది మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి సంతోషకరమైన విషయాలను వింటారు.
మిథునం – వ్యాపారస్తులు కొత్తగా వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకోవాలని ఆలోచనలు చేస్తారు. సోదరుల నుండి సలహాలు తీసుకుంటారు. మీ తల్లిదండ్రులను దైవదర్శనానికి తీసుకెళ్తారు ఇది మీ మనసును సంతోష పరుస్తుంది.
కర్కాటకం – కుటుంబ ఆస్తికి సంబంధించిన వివాదం ఏదైనా ఉంటే మీకు అనుకూలంగా నిర్ణయాలు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో కోరుకున్న వాతావరణం పొందుతారు.
సింహం – ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని మంచి పనులు చేయడం వల్ల మీ మనోధైర్యం పెరుగుతుంది. ఏదైనా పనిని మొదలు పెడితే అది పూర్తి చేసిన తర్వాతనే ప్రశాంతతను పొందుతారు.
కన్య – వ్యాపారులకు కొన్ని కొత్త ప్రణాళికలు వస్తాయి. కానీ మీరు వాటిని ముందుకు తీసుకెళ్లాలి అప్పుడే మీరు విజయవంతం అవుతారు. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం.
తుల – వృత్తి- వ్యాపారాలలో మీకు కొంత పని అప్పగించబడవచ్చు ఇందులో మీకు సహ ఉద్యోగుల మద్దతు అవసరం అవుతుంది.విద్యార్థులు ఏదైనా పోటీలో పాల్గొనాలనుకునే వారికి అన్ని విధాలా మంచిగా ఉంటుంది
వృశ్చికం – కుటుంబంలోని కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు అందరితో సంతోషంగా గడుపుతారు.
ధనుస్సు – మీ పని ఏదైనా అసంపూర్తిగా ఉంటే మీరు దాన్ని స్నేహితుడితో కలిసి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. పనిచేసే వ్యక్తులు ఈరోజు గౌరవాన్ని పొందుతారు. ఉద్యోగులకు జీతం కూడా పెరగొచ్చు.
మకరం – కొన్ని సామాజిక కార్యక్రమాలకు హాజరయ్యే సూచన. దానధర్మాలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. మీరు ఆత్మవిశ్వాసంతో చేసే పనులన్నింటిలో విజయం సాధిస్తారు.
కుంభం – పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. పనులు నిదానంగా సాగుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి.
మీనం – వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. చాలా బిజీగా ఉంటారు. మరోవైపు పిల్లల ఆనందాన్ని చూసి మీరు సంతోషిస్తారు. చిన్న వ్యాపారస్తులు తమ కోరిక మేరకు ఈరోజు లాభాలను పొందగలుగుతారు.