Monday, February 3, 2025

సోమవారం రాశి ఫలాలు(03-02-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. పనులు శ్రమానాంతరం పూర్తవుతాయి. ఉన్నత హోదాల్లోని వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి సాధిస్తారు.

వృషభం –  రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా  సమర్థ వంతంగా నిర్వహిస్తారు, క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి.

మిథునం – గృహ నిర్మాణ ఆలోచనలు ముందుకు సాగుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి.

కర్కాటకం – సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. అయినా అవసరాలకు డబ్బు అందుతుంది. చేపట్టిన పనులు సన్నిహితులు సహాయంతో పూర్తి చేస్తారు.

సింహం – ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది. వివాహాది శుభకార్యాలు సానుకూల పడతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి.

కన్య – మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది.

తుల – ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు నలుగురి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్లడం మంచిది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతకాలం వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడును.

వృశ్చికం – వ్యాపార పరంగా లాభాలు అందుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్థిరాస్తులను అమ్మే విషయంలో కొనుగోలు చేసే విషయంలో కొంత జాప్యం ఏర్పడుతుంది.

ధనుస్సు – కొన్ని అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. భూ సంబంధిత వ్యవహారాలలో డాక్యుమెంటే షన్ సంబంధిత వ్యవహారాలలో జాగ్రత్తలు తప్పనిసరిగా అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.

మకరం –  వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా కూడాను అభివృద్ధి అనేది ఉంటుంది. జీవిత భాగస్వామి తో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి.

కుంభం –  జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పరచుకోవాలి లేకపోతే ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరి స్తుంది. చిన్నచిన్న వ్యాపారస్తులకు బాగుంటుంది. అప్పు ఇవ్వడం అప్పు తీసుకోవడం రెండూ కలిసి రావు.

మీనం – భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమవుతుంది. చిన్న చిన్న విషయాలకు ఒత్తిడికి గురికావద్దు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News