Thursday, December 19, 2024

సోమవారం రాశి ఫలాలు(04-02-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – పెట్టుబడులకు తగిన లాభాలు ఉండవు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు అంతగా కలిసి రావు.

వృషభం – క్రయ విక్రయాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనులలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది.

మిథునం – ఆర్ధిక ఇబ్బందుల నుండి బయట పడతారు. క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం.మానసిక ప్రశాంతత పొందుతారు.

కర్కాటకం – వృత్తి-వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకొంటారు. సంతానం  పరంగా నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు.

సింహం – శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తి-వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు.

కన్య – పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

తుల – వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులలో ప్రోత్సాహం లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.

వృశ్చికం – ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. పెట్టుబడులలో ప్రోత్సాహం లభిస్తుంది.

ధనున్సు – ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.

మకరం – ముఖ్యమైన పనులు నత్తనడకన సాగుతాయి. అనుకున్న పనులలో జాప్యం జరుగుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. విందు, వినోదాలు.ప్రముఖులతో పరిచయాలు.

కుంభం – శ్రమ అధికంగా ఉంటుంది. దూరపు బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖుల కలయిక. ఋణ బాధలు తీరి ఊరట చెందుతారు.

మీనం – ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వనాలు ఆశ్చర్యపరుస్తాయి. అనుకోని విధంగా ధన, వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News