మేషం – శత్రువుల సైతం మిత్రులుగా మారే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి. విద్య సాంకేతిక రంగాలలోని వారికి ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు.
వృషభం – క్రయ విక్రయాలలో లాభాలు గడిస్తారు. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. చర్చా గోష్టులలో చురుకుగా పాల్గొంటారు. మానసికంగా ఉల్లాసంగా గడుపుతారు.
మిథునం – మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా ఒక అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు.
కర్కాటకం – ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి.
సింహం – రుణాలు తీరి ఊరట చెందుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, వృత్తి ఉద్యోగాలలో కలిసుబాటు ఉంటుంది. కీలక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తొందరపాటు తగదు.
కన్య – ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామి నుండి వస్తు లాభాలు పొందుతారు. ఆస్తి వివాదాలు ఎదురై చికాకు కలిగించిన అధిగమించి ముందుకు సాగుతారు.
తుల – వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయ సహకారాలు పొందుతారు. ఆరోగ్యం వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.
వృశ్చికం – కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
ధనున్సు – సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలలో పురోగతి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.
మకరం – ఉద్యోగంలో కీలకమైన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితులలో చాలామందికి మీరే దిక్కు అవుతారు. పనిచేసే సామర్ధ్యం నేర్పరితనం మిమ్మల్ని నిలబెడతాయి.
కుంభం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాల మంచిది. ఆరోగ్యం వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. కాంట్రాక్టులు దక్కుతాయి.
మీనం – సంతానం నుండి ధన లాభం పొందుతారు. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు, సంఘంలో గౌరవం పొందుతారు. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది.