Sunday, December 22, 2024

సోమవారం రాశి ఫలాలు(04-11-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. దీర్ఘ ఆలోచనలు కొనసాగుతాయి. వాయిదా వేయుటకు వీలులేని పరిస్థితులలో నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలను తెలియజేయవలసి వస్తుంది.

వృషభం – చేతి వృత్తి పనుల వారికి అనుకూలంగా ఉంటుంది. శారీరక మానసిక శ్రమ అధికంగా ఉంటుంది. ధనం సర్దుబాటు చేసుకోవడం కష్టతరంగా పరిణమిస్తుంది. క్రెడిట్ కార్డు వినియోగం అధికమవుతుంది.

మిథునం – సందర్భోచిత నిర్ణయాలు తీసుకొని లాభపడగలుగుతారు. డాక్యుమెంట్స్ లో అవసరమైన మార్పులను చేస్తారు. అన్ని విధాలుగా జాగ్రత్త వహించాలని నిర్ణయించుకుంటారు.

కర్కాటకం – భూముల విషయంలో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఆరోగ్యం వాహనాల విషయంలో మెలకువ అవసరం. సంతానం విద్యా విషయంలో నూతన బాధ్యతలు చేపడతారు.

సింహం – సోదరీ సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. చిన్ననాటి మిత్రుల ద్వారా కీలక సమాచారం తెలుసుకుంటారు. వృత్తి- వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

కన్య – కీలకమని భావించిన అంశాలలో తొందరపాటు చేయకూడదు. పంతాలు పట్టింపులకు దూరంగా ఉండండి.  ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక విషయాలలో మెలకువలు అవసరం.

తుల – పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్వల్పకాల పరిస్థితుల వలన అధికంగా లాభపడతారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడిన పూర్తి చేస్తారు.

వృశ్చికం – కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.

ధనుస్సు – ఎంతో సన్నిహితంగా ఉన్నవారు మీకు విరుద్ధంగా మారి మిమ్మల్ని నిందారోపణలకు గురిచేస్తారు. వృత్తి- వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

మకరం – రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి అనుకూల కాలం. మీ భవిష్యత్తు కోసం ఎక్కువగా యోచిస్తారు. వ్యతిరేక వాతావరణం లో కూడా అనుకూల ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు.

కుంభం – నష్టం రావాల్సిన చోట నష్టం రాదు. కొద్దిపాటి మానసిక ఆందోళనకు గురి అయిన ఆచరణలో చెడు ఫలితాలను అందుకోరు. విదేశాలలోని మీ బంధుమిత్ర వర్గ సహాయ సహకారాలను అందుకుంటారు.

మీనం – ముఖ్యమైన జఠిలమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. స్పెక్యులేషన్ మధ్యస్థంగా ఉంటుంది. మీ మీద నమ్మకమును గుడ్ విల్ ను రుజువు చేసుకుంటారు. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు.

 

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News