Wednesday, January 8, 2025

బుధవారం రాశి ఫలాలు(04-12-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – పనులలో జాప్యం జరిగిన పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకారంగా ఉంటుంది. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం – జమ ఖర్చులు ఆదాయ వ్యయాలు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. నూతన వ్యక్తులు పరిచయమై మాట సహాయం అందిస్తారు.

మిథునం –  గృహం  కొనుగోలు యత్నాలు ఆచరణలో పెడతారు. తల్లిదండ్రుల విషయంలో ప్రత్యేక శ్రద్ధను వహిస్తారు. చాలా విషయాలలో ఒంటరి పోరాటం చేయవలసి వచ్చినప్పటికీ వెనుకడుగు వేయరు.

కర్కాటకం – వివాదాస్పద అంశాలను వదిలివేయడం మంచిది. దూరప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు  అందుకుంటారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది.

సింహం – దీర్ఘాలోచనల వలన ప్రయోజనం ఉండదు. సన్నిహిత మిత్రబృందంతో కలిసి ప్రయాణాలను చేస్తారు. కుటుంబ సభ్యులతొ ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు,

కన్య – క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. స్థిరత్వం ధైర్యం వలన అనుకూల ఫలితాలను సాధిస్తారు.  ఆర్థిక వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు.

తుల – నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం. గృహ నిర్మాణ ఆలోచనలు మీకు మేలు కలిగిస్తాయి. ప్రయాణాలను సాగిస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.

వృశ్చికం – మీ మాట ఇటు ఇంట్లో అటు బయట చెల్లుబాటు కావడం మీ సంతోషానికి కారణం అవుతుంది.  ఆరోగ్యం పట్ల కొంత మెలకువ అవసరం. వినోద కార్యక్రమాలకు ఇచ్చిన ప్రాముఖ్యతను వృత్తికి ఇవ్వరు.

ధనుస్సు – ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఆస్తి వివాదాలు సమసిపోతాయి. భూముల క్రయ విక్రయాలలో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. గతంలో మీరు చేసిన శ్రమ ఇప్పుడు అక్కరకు వస్తుంది.

మకరం – బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలకు సంబంధించిన తేదీలను ఖరారు చేసుకుంటారు. దూరప్రాంత ప్రయాణాలు చేయడానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకుంటారు.

కుంభం – వాయిదా పడుతూ వస్తున్న వ్యక్తిగత పనులను పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారాలలో స్వల్ప ఒడిదుడుకులు ఎదురయ్యే సూచన కొన్ని చిన్న చిన్న అవకాశాలు అనుకోకుండా లభిస్తాయి.

మీనం – శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. అంతరంగిక వ్యవహారాలలో కొన్ని రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కోర్టు కేసులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News