Sunday, December 29, 2024

మంగళవారం రాశి ఫలాలు(05-03-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – శ్రమ తప్ప ఫలితం ఉండదు.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు . ముఖ్యమైన విషయ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు.

వ్యషభం – వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.

మిథునం – చేపట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు భవిష్యత్తు కోసం కార్యచరణ చేస్తారు.

కర్కాటకం – వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్తు సామాగ్రిని కొనుగోలు చేస్తారు.. అనుకోని అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.

సింహం – ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు.  నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు చేయడం శ్రేయస్కరం. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. రుణాలు కొంతవరకు తీరుతాయి.

కన్య –  వృత్తి వ్యాపారాలలో స్వల్ప ధన లాభం పొందుతారు. రాబడి ఎక్కువగా ఉన్నా కూడా దానికి తగిన ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది.

తుల – చేపట్టిన ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.అనుకోని విధంగా మిత్రులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి.

వ్యశ్చికం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.చేపట్టిన పనులలో జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి.

ధనుస్సు – ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితులు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి, అనాలోచిత నిర్ణయాలకు దూరంగా ఉండటం మేలు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.

మకరం – ఇంటాబయట మీదే పై చేయిగా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పై దృష్టి అవసరం.

కుంభం – ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.కొంతవరకు ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పంద లావాదేవీలు జరుపుతారు. చిన్ననాటి మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

మీనం – ఆర్థిక పరిస్థితి మధ్యస్థంగా ఉన్నా అవసరాలకు ధనం అందుతుంది.ముఖ్యమైన వ్యవహారాలలో పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కొంత మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది. ధన, వస్తులాభాలు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News