మేషం – గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు.ఆర్థిక అభివృద్ధి కొరకు విశేషమైన కృషి చేస్తారు.
వృషభం – నూతన ఉత్సాహంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. క్రయవిక్రయాలలో లాభాలు వస్తాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు.
మిథునం – దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు.
కర్కాటకం – పెట్టుబడులకు తగిన లాభాలు గడిస్తారు. ఆరోగ్యం పట్ల చాలా మెలకువ అవసరం. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి నుండి ధన సహాయం అందుకుంటారు.
సింహం – సభలు సమావేశాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాల సందర్శన మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలుగుతాయి.ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా అవకాశాలు మీ చెంతకు వస్తాయి.
కన్య – ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పరపతి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వాహనాలు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తలు అవసరం.
తుల – దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత బయటపడతారు. సంతానం సాంకేతిక పరమైన విద్య అవకాశాలు పొందుతారు. ప్రభుత్వ పరంగా రావలసిన ప్రయోజనాలు దక్కుతాయి.
వృశ్చికం – ప్రముఖులతో పరిచయాలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి.
ధనున్సు – సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది. పట్టుదలతో ముందుకు సాగుతారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
మకరం – దూరప్రాంతల నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగ విషయాలలో కఠినంగా ప్రవర్తిస్తారు. న్యాయబద్ధంగా మీరు వ్యవహరించే తీరు చాలా మందికి నచ్చదు.
కుంభం – మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు గట్టి పోటీని, విమర్శలను ఎదుర్కొనవలసి వస్తుంది. కాంట్రాక్టులు లైసెన్సులు లాభిస్తాయి. పిల్లల విద్యా విషయమై ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు.
మీనం – వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని ఆలోచనలు వస్తాయి. సహుద్యోగులు మీ మీద చేస్తున్న దుష్ప్రచారాలు అబద్ధాలేనని నిరూపిస్తారు. ప్రభుత్వపరమైన పనులు అనుకూలిస్తాయి.