మేషం – ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. పొదుపు మొదలగు అంశాలు నామమాత్రంగా ఉంటాయి. మహోన్నతమైన పనులు సాధించుకోవడానికి మహోన్నత వ్యక్తుల సహకారం అవసరం లేదని నిరూపించడానికి విఫలయత్నం చేస్తారు.
వృషభం – ఆర్థికస్థితి మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత చాలా విషయాలను ప్రభావితం చేస్తుంది. సంతాన పురోభివృద్ధికి విశేషంగా శ్రమించి సత్ఫలితాలు సాధిస్తారు.
మిథునం – నిర్మాణాత్మకమైన నిర్ణయాలను అమలు చేయుటకు తగిన వ్యక్తులు కలుస్తారు. బరువైన కొన్ని బాధ్యతలను దించుకుంటారు. వెనువెంటనే కాకపోయినా మీ నిజాయితీ గుర్తింపుకు వస్తాయి.
కర్కాటకం – ఉద్యోగంలో స్థానం పదిలంగా ఉంటుంది. వ్యాపార పరంగా చెప్పుకోదగిన లాభాలు రాకపోయినా నష్టాలు ఉండవు. ఆర్థిక సర్దుబాటులలో మీ వ్యూహాలు ఫలిస్తాయి.
సింహం – ప్రజా సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. పుణ్యక్షేత్రాలకు, తీర్థయాత్రలకు, దైవదర్శనానికి మీరు వేసుకున్న కొన్ని ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయి.
కన్య – శ్రమకు తగిన ఫలితం చేతికంద లేదని విచారించకండి. ఓపిక గా నడుచుకోవడం ద్వారా మంచి ఫలితాలు చవిచూస్తారు.చిన్ననాటి స్నేహితునితో కలిసి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు.
తుల – ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో సల్ప లాభాలు పొందుతారు. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు.
వృశ్చికం – జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. కొన్ని విషయాలలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
ధనుస్సు – ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత పొందుతారు. సంతాన విద్యా విషయాలలో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంటారు.
మకరం – మీ ఆధ్వర్యంలో నడిచే కొన్ని సంస్థలకు కొన్ని అవార్డులు రావచ్చు. ముఖ్యమైన కార్యక్రమములో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు. మీ శక్తి సామర్థ్యములు ఆకస్మికంగా కొంతమందికి గుర్తుకు వస్తాయి.
కుంభం – మంచి అవకాశం గురించి గతంలో చేసిన ప్రయత్నం ఇప్పుడు అక్కరకు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల స్థితి చెప్పుకోదగిన స్థాయిలో మెరుగవుతుంది.
మీనం – గృహ సంబంధమైన విషయాలు స్వల్ప మార్పులకు చోటు చేసుకుంటాయి. కుటుంబంలోని వారి ఆరోగ్య విషయం ప్రత్యేక శ్రద్ధ కనబరిచవలసి ఉంటుంది. ఆర్థికపరమైన సర్దుబాట్లు ఎక్కువ అవుతాయి.
సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225