Thursday, December 5, 2024

గురువారం రాశి ఫలాలు(05-12-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – అధికార స్థానాలలో ఉన్నవారు ప్రతి చిన్న విషయానికే మీ మీద ఆధారపడతారు. కుటుంబ విషయాలలోనూ గృహది విషయాలలోనూ ఆసక్తి చూపుతారు.

వృషభం – చేస్తున్న వృత్తిలో మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని విషయాలలో అలుపెరుగని ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. సంతానం సాంకేతిక విద్యలలో రాణిస్తారు.

మిథునం – మానసిక ఉద్వేగాన్ని సాధ్యమైనంతగా అదుపు చేసుకోండి. ఫలితాలు ఎలా ఉన్నా కృషిలో మాత్రం లోపం ఉండకూడదని నిర్ణయించుకుంటారు. ఎలాంటి సమస్యలు ఎదురైన ధైర్యంగా ఎదుర్కొంటారు.

కర్కాటకం – ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు సానుకూల పడతాయి.  ఉద్యోగాలలో ఏర్పడిన అవంతరాలు తొలగిపోతాయి. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు లాభిస్తాయి.

సింహం – అధ్యాపక వృత్తిలో ఉన్నవారికి మంచి పేరు లభిస్తుంది. వ్యాపారంలో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. పెట్టుబడులకు తగిన సహాయ సహకారాలు అందుకుంటారు.

కన్య – నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. మానసిక ఆనందం కలుగుతుంది.

తుల –  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొంటారు. కొంత మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది.

వృశ్చికం – వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలపరంగా అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో  నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి పై అధికారుల మెప్పును పొందుతారు.

ధనుస్సు – క్రయవిక్రయాలలో మెలకువలు అవసరం. చేతికి వచ్చిన ధనం సద్వినియోగం అవుతుంది. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మకరం – వ్యాపార రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న మీవారికి ఇక్కడి స్థితిగతులను వివరించి వారిని ఆర్థిక సహాయం అర్థిస్తారు.

కుంభం – సాంకేతిక విద్యా సంబంధమైన విషయాలలో పురోగతి బాగుంటుంది. శుభకార్యాలు ముడి పడతాయి. సాంస్కృతిక క్రీడా రంగాలలో ముందడుగు వేయగలుగుతారు.

మీనం – సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి చాలా అనుకూలంగా ఉంది

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News