Sunday, January 19, 2025

మంగళవారం రాశి ఫలాలు(06-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – వివాహాది శుభకార్యముల విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనైనను తదుపరి సానుకూలంగా మారుట సంభవిస్తుంది. నూతన వ్యాపార యత్నములను కొద్ది కాలం పాటు వాయిదా వేయడం మంచిది.

వ్యషభం – విదేశంలో విద్యకి వెళ్లాలనుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు అనుకూలమైన కాలం. విదేశంలో ఉన్న మిత్రుల నుండి కానుకలు. ధనము లభించే అవకాశం గోచరిస్తుంది. శుభవార్తను వింటారు.

మిథునం – కుటుంబ సభ్యులతో దేవాలయ సందర్శనం యోగ్యతను గ్రహగతులు సూచిస్తున్నాయి. గృహాలంకరణకు ధనమును ఖర్చు చేస్తారు. కొత్త మిత్రులతో పరిచయాలు అధికంగా ఉంటాయి.

కర్కాటకం – కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. దూర ప్రయాణములను కొంతకాలం వాయిదా వేయటం మేలు. వాతావరణ మార్పిడి స్థల మార్పిడి జరిగే అవకాశం ఉంది.

సింహం – కొంతమంది ప్రోత్సాహం ఎంతో చైతన్యము కలిగిస్తుంది. అతిధి మర్యాదలకు గృహవసరంలకు విలాసవంతమైన వస్తువులు కొనుటకు అధిక ధనం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

కన్య –  చిట్ఫండ్లు. ఉమ్మడి ఖాతాలు వంటి వాటికి చిక్కులు ఏర్పడినప్పటికీ చక్కబెట్టుకోగలుగుతారు. నీరు విద్యుత్ సదుపాయములు గృహాలంకరణములకు ధనమును వెచ్చిస్తారు.

తుల – దూర బంధువుల రాక, విందులు, సమావేశాలు మిత్రులతో సంప్రదింపులు ఆనందం ఇస్తాయి. నిర్మాణాత్మక పనులకు కొంత ఉత్సాహం మిత్రుల ద్వారా లభిస్తుంది. సహుద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి.

వ్యశ్చికం – చేపట్టిన పనులు త్వరలో పూర్తయ్యే విధంగా మీ ప్రణాళిక ఏర్పరచుకోగలుగుతారు. ఈ రాశిలోని విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు.

ధనుస్సు – అనుకున్న కార్యక్రమాల్లో ఆటంకాలు ఇబ్బందులు ఎదురయ్యే  పరిస్థితి గోచరిస్తుంది. ధైర్యంతో చేయవలసిన పనిని సఫలం చేయగలడానికి గట్టి ప్రయత్నం చేస్తారు.

మకరం – వృత్తి- విషయంలో కొంత ఓర్పును పాటించుట అవసరం వచ్చిన ఒక సదావకాశంని  సద్వినియోగపర్చుకోగలిగితే మేలు జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. స్వల్ప ధన లాభం.

కుంభం – విధుల నిర్వహణలో గాని వ్యాపారంలో గాని మార్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువులతో ప్రేమానురాగాలను పెంపొందించే అవకాశం ఉన్నది.

మీనం – మీ నిపుణతకు సమర్థతకు సదవకాశం లభిస్తుంది. వృత్తి వ్యాపారంలో మీ తెలివితేటలు బాగా ఉపకరిస్తాయి. మీ పేరు మీద ఉన్నటువంటి స్థిరాస్తులు మంచి ధర కలిగి ఉండడం మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News