మేషం – పనులలో అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. మీ ప్రతిభ పాటవాలు గుర్తింపు నోచుకుంటాయి. వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
వృషభం – చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. మొండికి పడిన బకాయలు చేతికి అంది వస్తాయి.
మిథునం – శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచడం మంచిది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. మధ్యవర్తి పరిష్కారం వల్ల లాభం చేకూరుతుంది.
కర్కాటకం – క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ రకాల సంస్థలు పురోగమనంలో ఉంటాయి. పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.
సింహం – ప్రజా సంబంధ వృత్తులలో ఉన్న వారికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. అనుకొని అవకాశాలు కలిసి వస్తాయి. మొండికి పడిన బకాయిలు చేతికి అంది వస్తాయి. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు.
కన్య – వృత్తి ఉద్యోగాలపరంగా అభివృద్ధి సాధిస్తారు. అధికారులతో మంతనాలు రాజకీయ పైరవీలు లాభిస్తాయి.
తుల – ప్రతి విషయంలోనూ ప్రతి రంగంలోనూ గట్టి పోటీ ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థిక భారం తేలికవుతుంది.
వృశ్చికం – ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏర్పడిన అవరోధాలు తొలగుతాయి. పనులు శ్రమాదికంతో పూర్తి చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యి చికాకులు పెడతాయి.
ధనుస్సు – ఆర్థిక వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. సన్నిహితులతో ఏర్పడిన విభేదాలు తీరతాయి. సినీ, టీవీ రంగంలోని వారికి అనుకూలమైన కాలం.
మకరం – వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. దూరప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
కుంభం – ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తి చేస్తారు. విదేశాలకు సంబంధించిన యత్నములకు ఇతరుల పరపతిని నమ్ముకోవడం కన్నా స్వయంకృషి చేయడం ఉత్తమమని గ్రహించండి.
మీనం – వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సెంటిమెంటు వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. పాత బాకీలు వసూలు అవుతాయి. ఓర్పుతో ముందుకు సాగుతారు.
సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225