Wednesday, January 8, 2025

మంగళవారం రాశి ఫలాలు(07-01-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – కర్మ సిద్ధి గోచరిస్తుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి అని గ్రహించండి బద్దకాన్ని దరిచేరినీయకండి. కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

వృషభం –  బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు చేస్తారు. ఇవి మీకు మేలు కలిగిస్తాయి. చక్కటి ఆలోచనలతో ముందుకు సాగుతారు.

మిథునం – కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందికర వాతావరణ నెలకొంటుంది. జీవిత భాగస్వామి తో ఆచితూచి మెలగడం చెప్పదగినది.

కర్కాటకం – అనుకూల ఫలితాలను సాధిస్తారు. వ్యాపార పరంగా వృత్తిపరంగా మంచి నిపుణతను చూపించగలుగుతారు. వీసా పాస్పోర్ట్ వంటి అంశాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి.

సింహం – పై అధికారుల అండదండలు మీకు లభిస్తాయి. సహుద్యోగులతో స్నేహభావంతో మెలుగుతారు. శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్య – కుటుంబ ఆర్థిక విషయాల పురోగతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీకు దక్కిన ఒక అధికార పత్రం వలన పరోక్షంగా లాభపడతారు. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

తుల – అభివృద్ధి కోసం అనేక విధాల ప్రయత్నం చేస్తారు. నూతనమైన ఫైనాన్షియల్ స్కీమ్స్ లో చేరమని వేధించే ఏజెంట్స్ వలన చికాకు కలుగుతుంది. మిత్రులతో జరిపే సంభాషణలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.

వృశ్చికం – పెట్టుబడుల విషయంలో నిదానం చాలా అవసరం. స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమ చూపుతారు. ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. ఈ సందర్భంగా కొంతమంది ఈర్ష్యా ద్వేషాలు మీరు స్పష్టంగా చూడగలుగుతారు

ధనుస్సు – ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు, ఆర్థిక విషయాలకు సంబంధించిన అంశాలు మీకు అనుకూలంగానే ఉన్నాయని భావిస్తారు.

మకరం –  మీ సంస్థ ప్రాబల్యం పెంచుకోవడానికి మీరు చేపట్టిన నూతన పథకాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఊహించని విధంగా కళా, సాహిత్య రంగాలలో మీరు చేసే కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది.

కుంభం –  కళాకారులు మీ క్రియేటివిటీ తో రూపొందించిన సీరియల్స్ డాక్యుమెంట్స్ మంచి ఆదరణకు నోచుకుంటాయి. ఉద్యొగస్తులు కార్యాలయంలో ఇతరుల అసమర్ధత మీపాలిట వరంగా మారుతుంది.

మీనం – ఉద్యోగంలో స్వల్ప ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన బాధ్యతలు అధికారాలు మీ చేతికి అప్పగించబడతాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News