మేషం – బహుముఖంగా ప్రజ్ఞా పాటవాలు కనబరుస్తారు. సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పురోభివృద్ధిని సాధించగలుగుతారు. రాజకీయ పరిచయాలు లాభిస్తాయి.
వృషభం – వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి పెంపొందుతుంది. అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయి. కోర్టు వ్యవహారాలు సానుకూల పడతాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం.
మిథునం – ఉపయుక్తమని భావించిన ప్రతి వ్యవహారాలలోనూ ఓర్పు నేర్పులను కనబరుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు, ప్రముఖుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు.
కర్కాటకం – ప్రతి విషయంలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తారు. అందుకు తగిన విధంగా కృషిని కూడా సాధించగలుగుతారు. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన విషయాలలో మెలకువలు అవసరం.
సింహం – ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక స్థితిగతుల పైన ప్రధానంగా దృష్టిని సారిస్తారు. ఆహార ఆరోగ్య సూత్రాలను తూ.చా తప్పకుండా పాటించడం మంచిది.
కన్య – విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. పనులు నిదానంగా సాగినప్పటికీ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లదు.
తుల – మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి గాను అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబ పురోభివృద్ధి, వ్యక్తిగత పురోభివృద్ధి బాగుంటుంది. సంతృప్తికరమైన ఫలితాలను సాధించగలుగుతారు.
వృశ్చికం – అధిక శ్రమ తప్పకపోవచ్చు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వీసా పాస్పోర్ట్ వంటి అంశాలు కలిసి వస్తాయి. రుణాలను చాలా వరకు తీరుస్తారు.
ధనుస్సు – వ్యక్తిగత విషయాలలో ఇతరుల జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. నిర్మోహమాట వైఖరి కనబరుస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు.
మకరం – భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. మీ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన వారు నిజంగా ఎవరని తెలుసుకోగలుగుతారు.దీర్ఘకాలిక రుణాలను గడువుకు ముందే తీర్చి వేస్తారు.
కుంభం – ఓ ముఖ్యమైన పని కార్యాలయంలో పరిష్కారం అవుతుంది. కీలక స్థానంలో ఉన్న ఓ అధికారి ద్వారా దాన్ని సాధిస్తారు. మీ ఆలోచనలు కార్యరూపాన్ని సంతరించుకుంటాయి.
మీనం – అనవసరమైన విషయాలలో కాలయాపన చేస్తున్న ఆత్మీయులను గాడిలో పెడతారు. చెవి, ముక్కు , గొంతు సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీడియా వలన లాభపడతారు.