Friday, March 7, 2025

శుక్రవారం రాశి ఫలాలు(07-03-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థికంగా ఎంత ఆదాయం వచ్చినా దాచుకునేదేమి ఉండదు. రావాల్సిన డబ్బుకు ఖర్చు రెడీగా ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు మానసికమైన ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

వ్యషభం – రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. వివాదాలు తగాదాలు మధ్యవర్తి పంచనామాలకు దూరంగా ఉండండి. మీ ప్రమేయం లేని విషయాల్లో మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తారు.

మిథునం – వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి. వ్యాపారంలో నూతన మార్పులు చేర్పులు కలిసి వస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలలో సీటు లభించడం కష్టం అవుతుంది.

కర్కాటకం – రాజకీయపరమైన వ్యూహాలు అంతగా లాభించవు. బలమైన శత్రువర్గాన్ని కూడా లెక్క చేయరు. ఉన్నతాధికారులతో మంచి సంబందబాంధవ్యాలు కలిగి ఉంటారు. ఆర్థిక పురోగతి బాగుంటుంది.

సింహం – వృత్తి ఉద్యోగాలపరంగా సంతృప్తి కలుగుతుంది.ప్రేమ మమకారం ఎవరిమీద అయితే     పెంచుకున్నారో వాళ్లు మంచి అభివృద్ధిలోకి వస్తారు. నవగృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది.

కన్య –  ఆరోగ్యం మెరుగుపడుతుంది.వ్యాపార సంబంధమైన విషయాలు ఇబ్బందిలేకుండా నడుస్తాయి. ఆర్థిక పరిస్థితులు కుదుటపడతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరిపోతాయి. విందు, వినోదాలలో పాల్గొంటారు.

తుల – ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల వద్ద పలుకుబడి ఉన్న ఉపయోగించుకోవడానికి ఇష్టపడరు. విందు వినోదాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటారు. అయినప్పటికీ కొన్ని విందులు వినోదాలకు వెళ్లవలసి వస్తుంది.

వ్యశ్చికం – నూతన వృత్తి వ్యాపార ఉద్యోగాల మీద దృష్టి పెడతారు. మీ జీవిత ఆశయం నెరవేర్చుకోవడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తారు. శుభవార్తలు వింటారు. స్వల్ప ధన లాభ సూచన.

ధనుస్సు – అందరిని ఒకే తాటిపై నడిపించి విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో నూతన మార్పులు చేయడం గాని లేక ఒక రంగం నుండి మరొక రంగంలోకి మారడం గాని సంభవించవచ్చు.

మకరం – రాజకీయరంగ ప్రవేశం చేస్తారు. విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలపరంగా శారీరక మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి.

కుంభం – దుష్ప్రచారాలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల సానుకూల ఫలితాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలపరంగా ఏర్పడిన ఇబ్బందులు సమస్యలు తీరిపోతాయి.

మీనం – వృత్తి ఉద్యోగాలపరంగా మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే శత్రువర్గాల ప్రయత్నాలు విఫలమవుతాయి. ప్రతి విషయంలోనూ ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల అన్నదండలు మీకు లభిస్తాయి. ధనలాభం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News