Monday, January 13, 2025

శనివారం రాశి ఫలాలు(07-12-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – వృత్తి ఉద్యోగాలలో లాభపడతారు. సంతాన క్షేమం పురోభివృద్ధి మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ నిజాయితీని రుజువు చేసుకోగలుగుతారు.

వృషభం – అనుకున్న పనులు కొంత జాప్యం మీద పూర్తి చేస్తారు. వ్యాపార పరమైన వ్యవహారాలలో గోప్యంగా వ్యవహరిస్తారు. బరువు బాధ్యతలు శుభకార్యాలు పూర్తి చేయడానికి అధిక ధనాన్ని వెచ్చిస్తారు.

మిథునం –  అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు స్త్రీలతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

కర్కాటకం – కీలకమని భావించిన వ్యవహారాలు సానుకూల పరుచుకోవడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక సమస్యలు చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ సందర్శనం చేసుకుంటారు.

సింహం – ప్రముఖులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం కాగలవు. తొందరపాటు మాటలు తగదు. రాజకీయ,  విద్యారంగాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది.

కన్య – చిన్ననాటి మిత్రుల నుండి సహాయం అందుతుంది గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. అధిక మొత్తంలో ధనాన్ని రుణ రూపేనా గ్రహిస్తారు. పదవులను సద్వినియోగం చేసుకుంటారు.

తుల – క్రయవిక్రయాలలో కొంత నిదానం అవసరం అనుభవం నేర్పిన గుణపాఠాలతోజీవితంలో కొన్ని మార్పులను చేర్పులను చేస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శన. కొన్ని సమస్యల నుండి బయటపడతారు.

వృశ్చికం – మీరు ఆశించిన రంగంలో మరింతగా పురోభివృద్ధిని సాధించవలసి ఉన్నదని భావిస్తారు.  ఖర్చులను అదుపులో ఉంచుకొనడానికి ప్రయత్నిస్తారు.

ధనుస్సు – ఆర్థిక పరిస్థితి ఓ మోస్తరుగా ఉన్న అవసరానికి ధనం చేతికంది వస్తుంది. కీలకమైన నిర్ణయాల వలన మీ జీవితం ఒక మంచి మలుపు తిరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు.

మకరం – వ్యక్తిగత అవకాశ అవసరాలకు సదుపాయాలకు కొత్త పెట్టుబడులకు విహారయాత్రలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ఉన్నత స్థానాలను మేదస్సుతో సాధిస్తారు. దైవభక్తి శ్రద్ధ కలిగి ఉంటారు.

కుంభం – నేర్పు కలిగిన వారిగా పేరు పొందుతారు పలు రంగాల పట్ల మీకున్న అనుభవం ఉపకరిస్తుంది. ముఖ్యమైన బాధ్యతలను స్వీకరిస్తారు మీ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదు.స్వల్ప ధన నష్టం వాటిల్లే సూచన.

మీనం – మంచి మాటలతో కార్యక్రమాలను ఏ విధంగా జయప్రదం చేసుకోవచ్చని అనేది అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. మీకు సంబంధించిన వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేస్తున్న వ్యక్తులను కట్టుదిట్టంగా పట్టుకోగలుగుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News