మేషం – మనోధైర్యం పెరుగుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి కొత్త కొత్త ఆహార నియమాలు పాటించడం వలన ప్రయోజనం కలగకపోగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి.
వృషభం – మీకు రావాల్సిన ధనం కొంతమంది వద్ద చిక్కుల్లో పడుతుంది. దాని గురించి ప్రస్తుతం అనుకున్న ఫలితం రాకపోయినా రావలసిన సొమ్ముకు ఇబ్బంది లేని పరిస్థితి ఏర్పడుతుంది.
మిథునం – కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. దైవానుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే అని కాలం మరోసారి రుజువు చేస్తుంది. అయిన వాళ్లతో సంబంధాలు కలుపుకోవాలనే మీ నిర్ణయాన్ని మార్చుకుంటారు.
కర్కాటకం – ఉద్యోగంలో అధిక శ్రమ, అబద్ధాలు చెప్పి తప్పించుకునే సిబ్బంది వల్ల కొంత ఇబ్బంది వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని సార్లు విశ్రాంతికి సమయం ఉండదు.
సింహం- అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి శారీరకంగా, మానసికంగా శ్రమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో రహస్యమైన సమావేశాలు చర్చలు కొనసాగిస్తారు.అనుకున్న పురోగతిలో కొంత భాగం సాధిస్తారు.
కన్య – కొందరు విషయంలో శుభకార్యాలకు సంబంధించిన అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మంచి అవకాశాలు వచ్చినా ఏదో ఒక రకమైన వంకలు పెట్టే వాళ్ళు సంతృప్తి పడని వాళ్లతో మీకు ఇబ్బందులువస్తాయి
తుల – గతంలో ఆగిపోయిన ఓ అమ్మకం వల్ల ప్రస్తుతం లాభం పొందుతారు. సమాజంలో కుటుంబ స్థాయి పెరుగుతుంది. బైక్ రైడింగ్ లకి దూరంగా ఉండండి. కొన్ని ప్రమాదాలు తప్పుకొని చేదు వాస్తవాలు తెలుసుకుంటారు.
వృశ్చికం – కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కపటం లేని మనుషులు సహాయంగా ఉంటారు. పూర్తవుతాయో కావో అన్న అనుమానంతో మొదలుపెట్టిన కార్యక్రమాలు కూడా జయప్రదం అవుతాయి.
ధనుస్సు – ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు పొందుతారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనము పాటించండి. క్షణం వృధా చేయకుండా అవిశ్రాంతంగా శ్రమిస్తారు.
మకరం – కాలం అనుకూలంగా ఉంటుంది. మధ్యవర్తి వ్యవహారాలకు మాత్రం దూరంగా ఉండటం చెప్పదగినది. ఉచిత సలహాలు ఇవ్వడం తీసుకోకపోవడం ఉత్తమం.
కుంభం – ఆర్థికంగా లోటు ఉండదు. అయినప్పటికీ ధనం సంపాదించాలంటే విదేశాలకు వెళ్లవలసిందేనన్న భావనలు దృఢపడతాయి. కుటుంబంలోని ఐక్యమత్యత మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
మీనం – ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి- ఉద్యోగాలపరంగా మీ స్థాయి యధాతధంగా ఉంటుంది. చిన్న అవకాశాలను కూడా చేజార్చుకోరు.