Tuesday, April 8, 2025

శనివారం రాశి ఫలాలు(08-03-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగిన చివరికి పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. కొత్త కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. నూతన వస్తు లాభం.

వృషభం – వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.విహారయాత్రలు చేస్తారు.

మిథునం –  కుటుంబ విషయంలో పురోగతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలను అన్వేషించడంలో సఫలం కాగలరు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

కర్కాటకం – వృత్తి ఉద్యోగాలపరంగా సముచితమైన స్థానాన్ని సాధించడానికి విశేషమైన కృషిని చేస్తారు. ఆర్థికపరమైన అంశాల పైన దృష్టిని సారిస్తారు. సానుకూల ఫలితాలను సాధిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు.

సింహం – ఆర్థికపరమైన వ్యవహారాలలో మార్పులు చోటు చేసుకుంటాయి.పనులలో కొంత జాప్యం ఏర్పడుతుంది.ఉద్యోగ ప్రయత్నాలలో తొందరపాటు వద్దు. సంతానానికి నూతన విద్య అవకాశాలు వస్తాయి.

కన్య – ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా చేసే చిన్నపాటి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార కేంద్రాలలో లాభాలను అందుకోగలుగుతారు.

తుల – నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.  ప్రతి విషయంలోనూ తొందరపడకుండా సమయమును పాటిస్తూ సమయం కోసం వేచి ఉంటారు. అనుకొని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు.

వృశ్చికం – ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రాజకీయపరంగా చర్చలు సాగిస్తారు. వృత్తి ఉద్యోగాలపరంగా మీ స్థాయి యధాతధంగా ఉంటుంది. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు.

ధనుస్సు – మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు వద్దు.

మకరం – ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుంటారు. నూతన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు.

కుంభం – వృత్తి ఉద్యోగాలపరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏర్పడవు. వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి. రావలసిన మొండి బాకీలు వసూలు అవుతాయి.

మీనం – ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది.అనవసరమైన వివాదాలు చోటు చేసుకుంటాయి. ఏ విషయంలోను క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక అభివృద్ధి కొరకు అనేక విధాలుగా శ్రమిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News