Thursday, December 26, 2024

గురువారం రాశి ఫలాలు(08-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం- కుటుంబ సభ్యుల సౌఖ్యమునకు అవసరమైన వస్తువులను ఏర్పాటు చేస్తారు. మీరంటే ఇష్టం లేని వ్యక్తులు మిమ్ములను నిందారోపణలకు గురిచేస్తారు వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వృషభం- ఉన్నతాధికారుల నుండి లభించాల్సిన అవకాశాలు సహాయ సహకారాలు మీకు అందకపోవచ్చును. అయినా కూడా మీకున్న శక్తి సామర్థ్యాల మేరకు పనులను పూర్తి చేయగలుగుతారు..

మిథునం- చేయాలనుకున్న కార్యక్రమాలను వెంటనే అమలు చేస్తారు. మానసిక ప్రశాంతతను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఆత్మీయులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించగలుగుతారు.

కర్కాటకం- అనవసరమైన వాటికి ధనమును అధికంగా ఖర్చు చేస్తారు. ఉద్యోగం వ్యాపారం. ఆరోగ్యం మొదలగు విషయ వ్యవహారంలో ఉన్న సమస్యలను పూర్తి చేయగలుగుతారు.

సింహం- సమాజంలో మీ పేరు పలుకుబడి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.ఉద్యోగం నందు బదిలీకి పెట్టుకున్న అభ్యర్థన అనుకూలిస్తుంది. మానసిక ఆనందం లభిస్తుంది.

కన్య- మిత్రుల నుండి మీరు ఆశించిన సహాయం పొందగలుగుతారు. సంస్థలలో పనిచేసే వారికి యజమానులకు లాభం చేకూరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి అనుకుంటారు.

తుల- బంధువుల గృహంలో జరిగే శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థికంగా పరిస్థితి కొంచెం మెరుగయ్యే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి. స్వల్ప ధన లాభం .

వృశ్చికం- చేతిలో డబ్బు లేకపోయినా సరే అవసరాలకు ఏదో ఒక విధంగా  డబ్బు అందుతుంది. విదేశీ యానం కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన కాలం.

ధనస్సు: మీ మాటకు మంచితనంకు బంధువులలో మంచి పేరు లభించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఇది మీ మానసిక ఆనందం కి కారణం అవుతుంది. వృత్తిరీత్యా మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి.

మకరం: మీరు లాభం వస్తుందని చేపట్టిన వ్యాపారంలో నష్టం చవి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.  వ్యాపార సంబంధమైన కాగితములు, డాక్యుమెంట్లు మొదలగునవి చేతికి అందుతాయి.

కుంభం: మిత్రుల సహకారం లభించడం వలన మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తుల నుండి విలువైన వస్తువులు, సమాచారం అందుకోగలుగుతారు.

మీనం: వృత్తి అందు మీకు అవసరమైన వస్తువులను ఏర్పరుచుకుంటారు. ఆహార విషయంలో తగు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. బంధువులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News