Monday, December 23, 2024

శుక్రవారం రాశి ఫలాలు(09-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – మీ నైపుణ్యమునకు తగిన ప్రతిఫలమును పొందుతారు. ఆలోచనలను పక్కనపెట్టి మీ దైనందిన కార్యక్రమాల మీద దృష్టి సారిస్తారు. వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి వీసా లభించే అవకాశం.

వృషభం – మీరు చేయని పొరపాటుకు మిమ్ములను దోషులుగా నిర్ణయించే విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. వ్యాపరపరంగా కొంచెం నష్టం వాటిల్లే ప్రమాదం గోచరిస్తుంది.

మిథునం – ఉమ్మడిగా ఏ కార్యకలాపాలను చేపట్టకండి. బదిలీకి చేసే ప్రయత్నలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు. కొత్త ప్రదేశంనకు సంబంధించిన సందర్శన ఉంటుంది.

కర్కాటకం – చట్టపరమైన చిక్కులలో ఉన్న మీ ఆత్మీయులను సంరక్షించే ప్రయత్నంలకు ఆటంకాలు ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్వల్ప ధన లాభం.

సింహం – వ్యాపార పరంగా మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే కావున మీకు లాభించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.వ్యాపారం నందు మీకు తెలియకుండానే కొన్ని రహస్య కార్యకలాపాలు జరుగుతాయి.

కన్య – మీరు ఎదురు చూస్తున్న ఉత్తర్వులు చేతికి అంది వచ్చును. సినీ కళాకారులకు, గాయకులకు పురస్కారాలు లభిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలున్నాయి.

తుల – బంధుమిత్రుల సంతాన సంబంధిత విషయాలు ఒకవైపు వృత్తిలో పోరాటము మరోవైపు సూచిస్తున్నది. సహ ఉద్యోగులు భాగస్వాములు మిమ్ములను అపార్థం చేసుకునే అవకాశం ఉన్నవి.

వృశ్చికం – ఇతరత్రా విషయముల ప్రభావం వలన మీ వృత్తి వ్యాపార ఉద్యోగ కార్యకలాపములలో మార్పులు, అనిశ్చిత స్థితి సంభవిస్తుంది. రహస్యముగా కొంత సొమ్మును వెచ్చించవలసిన గ్రహస్థితి సూచిస్తుంది.

ధనుస్సు – సొంత వ్యాపారంలకు ఆర్థిక ప్రయోజనములకు మీరు ప్రాధాన్యమిస్తున్నారు అన్న అపోహలను తొలగించుకోవాల్సి ఉంటుంది. వాస్తవాలను పూర్తిగా చెప్పలేని స్థితి ఏర్పడుతుంది.

మకరం – ఆర్థిక స్థితిగతులు మెరుగుదల దిశలో పయనిస్తాయి. స్వల్ప కాలిక ట్రాన్సాక్షన్స్ లాభిస్తాయి. ప్రత్యర్థి వర్గం వారు ఉద్యోగంలో మీ స్థానమునకు మచ్చ తెచ్చేయత్నములను చేస్తారు.

కుంభం – ఆపదలను తృటిలో తప్పించుకుంటారు. ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి.  ఉపయోగపడవని భావించిన పత్రములో కొన్ని కీలకమైన మార్పులు, విలువలు ఏర్పడతాయి.

మీనం – చాడీలను చిల్లర స్థాయి ప్రచారంలను ధైర్యముగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన సమస్యలను విజయవంతంగా పరిష్కరిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News