Sunday, December 22, 2024

శనివారం రాశి ఫలాలు(09-11-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలపరంగా పురోభివృద్ధిని సాధిస్తారు. ఊహించని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు.

వృషభం – స్థిరాస్తి వివాదాలు సమసిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన సమయం.

మిథునం – క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఎంత కష్టపడినా ఫలితం నిదానంగా పొందుతారు.  కొన్ని విషయాలలో నిదానంగా ఉండటం మంచిది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

కర్కాటకం – ముఖ్యమైన వ్యవహారాలలో ఏ తొందరపాటు నిర్ణయాలు కూడా చేయరు. కీలక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తొందరపాటు తగదు. కోపతాపాలకు వివాదాలకు దూరంగా ఉండండి.

సింహం – పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. గోప్యతకు ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. దైనందిన జీవితంలో మార్పులు గోచరిస్తున్నాయి.

కన్య – వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.  ఆర్థిక పరిస్థితి మీకు సంతృప్తికరంగా ఉంటుంది. రుణ బాధల నుండి విముక్తి పొందుతారు.

తుల – శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వ్యాపారాలపరంగా పురోభివృద్ధిని సాధిస్తారు. ఊహించని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. మీలో ధైర్యానికి మీరే ఆశ్చర్యపోతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

వృశ్చికం – పారిశ్రామిక , విద్యా రంగాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది. భూముల క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఎంత కష్టపడినా ఫలితం నిదానంగా పొందుతారు.

ధనుస్సు – ముఖ్యమైన వ్యవహారాలలో బంధువుల సహాయం పొందుతారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి అనుకున్న విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు.

మకరం – ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాలలో తగిన జాగ్రత్తలు అవసరం. వృధా ప్రయాణాలు గోచరిస్తున్నాయి.

కుంభం – చిత్తశుద్ధితో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి మీ ఆలోచన శక్తిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు.

మీనం – పనులలో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు. రుణ బాధలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News