Friday, January 10, 2025

శుక్రవారం రాశి ఫలాలు(10-01-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – శుభకార్యాలు పురోభివృద్ధి దిశలో ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో అనుకూల గ్రహస్థితి కనబడుతుంది. గతంలో మీరు చేసిన కృషి ఇప్పుడు సత్ఫలితాలను ఇవ్వడానికి కారణం అవుతుంది.

వృషభం –  వృత్తిపరంగా లాభాలు పెంపొందుతాయి. నేల విడిచి సాము చేయరు. కలిగిన దాంట్లో తృప్తి పడతారు. రుణాలను తీర్చి వేస్తారు. సంతాన విద్యా విషయమై దీర్ఘంగా ఆలోచిస్తారు.

మిథునం – శ్రమ అధికంగా ఉంటుంది. కార్యాలయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో చెప్పుకోదగిన మార్పులు ఉండవు. కుటుంబ పురోభివృద్ధిని సాధించడానికి విశేషంగా శ్రమిస్తారు.

కర్కాటకం – బాధ్యతల బరువు కన్నా కొండను మోయడం తేలికని భావిస్తారు. ఆర్థిక సర్దుబాటులు నేర్పుగా చేయగలుగుతారు. ఆరోగ్యపరంగా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

సింహం – ఎంతో సాధించాలనుకున్న మీ తపన పూర్తిస్థాయిలో కాకపోయినా కొంత మేరకు సఫలీకృతం అవుతుంది. ప్రత్యర్ధులు బలవంతులైన దైవానుగ్రహం వలన మిమ్మల్ని ఏమి చేయలేక పోతారు.

కన్య – భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక మార్గాలు కలిసి వస్తాయి. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు సానుకూల పడతాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి.

తుల – ఇవ్వవలసిన రుణములు రావలసిన బాకీలు మొదలైన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి.  భూమి వివాదాలు, కోర్టు కేసుల నుండి బయటపడతారు. మానసికంగా సంతోషం కలిగి ఉంటారు.

వృశ్చికం – మీ మాటకు విలువ పెరుగుతుంది. కళా, సాహిత్య రంగాలలో ఉన్న వారికి కొన్ని అరుదైన ఆహ్వానాలు లభించే సూచనలు ఉన్నాయి.దైవ దర్శనాలుచేసుకుంటారు.

ధనుస్సు – ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. పెద్దలు ఉన్నత స్థానంలోని వారి సలహాలను సంప్రదింపులను పాటిస్తారు.

మకరం –  కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం మంచి స్థితిని సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.పుణ్య క్షేత్రాల సందర్శన.

కుంభం – మీ గురించి చెడుగా ప్రచారం చేసే వారితో వాదించడం కన్నా వారికి దూరంగా ఉండటం మంచిది అని భావిస్తారు. ఆ విధంగా వ్యవహరిస్తారు. మంచి ఫలితాలను సాధిస్తారు.

మీనం – వృత్తి వ్యాపారాలలో కొంత మార్పులు ఉంటాయి. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. క్రమశిక్షణకు ప్రాధాన్యతను ఇచ్చి సరికొత్త నిర్ణయాలు అమలు చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News