మేషం- వృత్తిలో పురోగతి సాధిస్తారు వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు. నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. దైవ చింతన కలిగి ఉంటారు.
వృషభం- ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
మిథునం- వృత్తి- వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి, ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించుకుంటారు. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు.
కర్కాటకం- పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. వృత్తిలో పురోగతి సాధిస్తారు. వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాదాలకు దూరంగా ఉండండి.
సింహం- మొండికి పడిన పనులలో కదలిక ఏర్పడుతుంది.ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి నేర్పుగా అందుపుచ్చుకోండి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి.
కన్య- స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం సానుకూలపడుతుంది.పరపతిని పెంచుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి. సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.
తుల- వృత్తి వ్యాపారాలపరంగా సాధారణ ఫలితాలు అందుకుంటారు. ఉన్నత స్థాయి వర్గం వారి అండదండలు లభిస్తాయి. శుభప్రదమైన ప్రసంగాలు,చర్చలు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి.
వృశ్చికం- ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ సంతృప్తి చెందరు. దేవాలయ సందర్శనం చేసుకుంటారు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకొని లాభపడతారు.
ధనస్సు: ఉద్యోగస్తులు కార్యాలయంలో తమ విధులు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.
మకరం: కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. వాటిని కొంతవరకు అమలు చేస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.
కుంభం: రుణాలను కొంతవరకు తీరుస్తారు. వృత్తి ఉద్యోగాలపరంగా సంతృప్తికరంగ వుంటుంది. నూతన ఒప్పందాలు కుదురుతాయి. బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు.
మీనం: వృత్తి ఉద్యోగ, వ్యాపారాల పరంగా సాధారణంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.ఆర్థికస్థితి పైన శ్రద్ధఎక్కువగా చూపించవలసి ఉంటుంది.