Wednesday, January 22, 2025

శనివారం రాశి ఫలాలు(10-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – స్థిర చర ఆస్తులు ఏర్పరచుకోవాలన్న ఆలోచనల్ని ముమ్మరం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాన్ని విరమించుకొని సొంతంగా వ్యాపార బాధ్యతలు చూసుకుందాం అనే ఆలోచన కలిగి ఉంటారు.

వృషభం – వృత్తి ఉద్యోగాలపరంగా ఎదుగుదల గోచరిస్తుంది. మధ్యవర్తి పంచనామాలకు దూరంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.

మిథునం – కంటికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ఫిక్స్డు డిపాజిట్లు లాభిస్తాయి.  పని యందు నిర్లక్ష్యం వహించి అధికారుల ద్వారా చిక్కులను తెచ్చుకోకండి.

కర్కాటకం – మీకు సంబంధం లేని ఇతరుల బరువు బాధ్యతలను మీ మీద వేయాలని  కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తారు. మీ నేర్పుతో వాటిని తిప్పి కొడతారు కొన్ని నిందారోపనలకు గురికావాల్సి వస్తుంది.

సింహం – వృత్తి లో పురోగతి ఉంటుంది వ్యాపార పరంగా మీ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకులు హోటల్స్ మంచి లాభాల బాటలో పయనిస్తాయి.

కన్య – వాహనాలు కొనుగోలు చేయాలన్న మీ ఆలోచనకి తాత్కాలికంగా కాస్త విరామం ఏర్పడుతుంది. కుటుంబాభివృద్ధికి మీ సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తారు.

తుల – రాజకీయ రంగంలో ఉన్న వారికి పై అధికారులు అండదండలు లభిస్తాయి మంచి పదవి లభించే అవకాశం గోచరిస్తుంది. ప్రతిష్టాత్మకమైన విద్యాలయాలలో సీటు లభిస్తుంది.

వృశ్చికం – అనుకున్న కార్యక్రమాలు అన్నీ పూర్తి చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో క్రమశిక్షణ ఉంటుంది. విదేశాలలో చదువుకోవాలన్న మీ  ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనుస్సు – ఆత్మీయులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన సమస్యలు వేధిస్తాయి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కీళ్ల నొప్పులు బాధిస్తాయి.ఈ విషయంలో జాగ్రత్త వహించండి.

మకరం –  అనుకున్న అవకాశాలన్నీ చేతికి అందుతాయి. కీలక సమయంలో కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటారు. విశ్వాసం లేని వ్యక్తులు చేసిన పనుల వల్ల సమాజం మీద నమ్మకం పోతుంది.

కుంభం –  అవివాహితులైన వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి. సంతానం లేని వారికి సంతాన పరంగా మంచి శుభవార్తని వినే పరిస్థితులు గోచరిస్తున్నాయి.

మీనం – అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నా ఆత్మీయులు అనుకున్న వారి ఆప్యాయత మీరు సంపాదించే ధనం పైనే ఉందని గ్రహిస్తారు. నిజమైన ప్రేమాభిమానాల కోసం పరితపిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News