మేషం – వృత్తి- ఉద్యోగ వ్యాపారాల పరంగా మీ స్థాయి గౌరవం పెంపొందుతాయి. ఉన్నత విద్యను అభ్యసించాలనే కోరిక నెరవేరుతుంది దూరదృష్టితో వ్యవహరిస్తారు.
వృషభం – నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటుకు ఏమాత్రం అవకాశం కల్పించరు. ముఖ్యమైన విషయాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు.
మిథునం – కొనుగోలు అమ్మకలకు సంబంధించిన అంశాలు లాభిస్తాయి న్యాయపరమైన అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి గాను నిష్ణాతుల తోటి సంప్రదింపులు సాగిస్తారు.
కర్కాటకం – పాత రుణాల నుండి విముక్తిని సాధించడానికి కొత్త రుణాలు చేయకుండా క్రమబద్ధమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించడానికి కావలసిన ప్రణాళికను రూపొందించుకుంటారు.
సింహం – అనుకోని నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వివాదస్పదమైన అంశాలకు దూరంగా ఉండటం చెప్పదగినది. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాలలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు.
కన్య – మీ సమర్థతను పెంచుకోగలుగుతారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం.
తుల – మీరు అతి ముఖ్యమని భావించిన వ్యవహారాలు ఎన్ని మలుపులు తిరిగినా చివరకు మీరు అనుకున్నదే అవుతుంది. రహస్య చర్చలు, రహస్య ప్రయాణాలు లాభసాటిగా పరిణమిస్తాయి.
వృశ్చికం – నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. దూరపు బంధువుల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ధనుస్సు – ఏమాత్రం ఉపయుక్తం లేని అంశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. మీ మీద వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీ గుడ్ విల్ ను రుజువు చేసుకోగలుగుతారు.
మకరం – శుభ ఫలితాలు ఉంటాయి. విందు వినోదాల ద్వారా పరిచయాలను విస్తృత పరుచుకోవడానికి రాను అనువైన మార్గాలు లభిస్తాయి. రుణాలు చేయనంత వరకు ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ ఉండవు.
కుంభం – మానసికంగా సంతోషం కలిగి ఉంటారు. భూమి సంబంధమైన వ్యవహారాలు, కట్టడాలకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.
మీనం – వృత్తి – ఉద్యోగాలపరంగా అభివృద్ధి గోచరిస్తుంది. ప్రభుత్వ పరంగా ప్రైవేటుపరంగా రావలసిన పెండింగ్ బిల్స్ ఓ కొలిక్కి వస్తాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది.