Tuesday, March 11, 2025

మంగళ వారం రాశి ఫలాలు(11-03-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది కొన్ని విషయాలలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. క్షణం తీరిక లేకుండా హడావుడిగా కాలాన్ని గడుపుతారు.

వృషభం – కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు లాభిస్తాయి. రాజకీయపరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు కొత్త మిత్రత్వానికి దారి తీస్తాయి.

మిథునం – కుటుంబంలో భేదాభిప్రాయాలు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కావలసిన వనరుల సమీకరణకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తారు.

కర్కాటకం – బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది.విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.

సింహం – ముఖ్యమైన అన్ని విషయాల పట్ల జాగ్రత్తతో వెలగడం చెప్పదగినది.చికాకు అసహనం అధికంగా ఉంటాయి. కీలకమైన సంతకాలు,విలువైన పత్రాల భద్రత విషయాలలో జాగ్రత్తలు వహించండి.

కన్య – ఆర్థిక అభివృద్ధి కొరకు కొంత కష్టపడాల్సిన తరుణం. తేలికగా సులువుగా పూర్తి అవుతాయి అనుకున్న పనులు ఎంతో కష్టపడితే గాని పూర్తవవు. సెల్స్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం.

తుల – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పక్షపాత ధోరణి అవలంబించకుండా అందరినీ సమన్యాయంతో ఆదరిస్తారు. జీవిత భాగస్వామి సలహాలను సంప్రదింపులను పాటిస్తారు.

వృశ్చికం – వ్యాపారంలో మీరు స్వయంగా తీసుకున్న కఠిన నిర్ణయాలు అమలు పరుస్తారు. జీవితంలో ప్రఖ్యాతిని సాధించడానికి అనుకూలమైన మార్గాలను అన్వేషించడంలో సఫలతను సాధించగలుగుతారు.

ధనుస్సు – ప్రతి పనిని క్రమ పద్ధతిలో నిర్వహిస్తారు, ధనానికన్నా వ్యక్తిగత గౌరవానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తారు. చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సాంకేతిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు.

మకరం – కీలకమైన వ్యవహారాలలో ఏర్పడిన ప్రతిబంధకాలు తొలగిపోతాయి.మానసిక ప్రశాంతత పొందుతారు. సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యత ఇచ్చి లాభపడతారు.

కుంభం – చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు, సంఘంలో గౌరవం పొందుతారు ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.ఆర్థిక పరిస్థితి అనుకూలంగాఉంటుంది.

మీనం – నూతన ప్రయత్నాలలో పురోగతి లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. పారిశ్రామిక రంగాలలోని వారికి బాగుంటుంది. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News