Sunday, December 22, 2024

మంగళవారం రాశి ఫలాలు(12-11-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి. మీ పరపతి పెరుగుతుంది. సువర్ణాభరణాలను కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

వృషభం – శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఫలితాలు బాగుంటాయి స్థిరాస్తి విషయంలో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి అనుకూలత ఏర్పడుతుంది. మానసిక సంతోషం లభిస్తుంది.

మిథునం – సహోదర సహోదరి వర్గానికి మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు. ఆర్థికంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏవి ఏర్పడవు. ఉపయుక్తమైన, శుభప్రదమైన ఖర్చులను గ్రహస్థితి సూచిస్తుంది.

కర్కాటకం – మీ కృషికి తగిన కీర్తి లభిస్తుంది. ప్రమోషన్ విషయంలో సాంకేతికపరమైన లోపాలు చోటు చేసుకుంటాయి నిర్మాణాత్మక వ్యవహారాలలో పురోభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉంటుంది.

సింహం – కుటుంబ బరువు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించగలుగుతారు. ఆహార నియమాలను పాటిస్తారు. ఆధ్యాత్మిక ధోరణితో మెలుగుతారు. సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు.

కన్య – మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. ఆర్థిక ప్రయోజనాలను సాధించుకోవడానికి మీరు చేసే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ అంచనాలు నిజమవుతాయి.

తుల – క్రమశిక్షణలోపించకుండా జాగ్రత్తలు వహిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. సంతాన పురోగతి బాగుంటుంది.

వృశ్చికం – కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. నూతన పెట్టుబడులలో తొందరపాటు వద్దు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

ధనుస్సు – నూతన వ్యక్తులు పరిచయమై మాట సహాయం అందిస్తారు. మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల కొంత మెలకువ అవసరం.

మకరం – ముఖ్యమైన వ్యవహారాలలో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతిని సాధించగలుగుతారు.

కుంభం – ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ దూరదృష్టితో వ్యవహరిస్తారు. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. తొందర పాటుకు ఏ మాత్రం అవకాశం కల్పించరు.

మీనం – వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. కొన్ని కొన్ని విషయాలలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. పోటీ పరీక్షలకు తగిన విధంగా సన్నద్ధం అవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News