మేషం – క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. మనసుకు తోచింది చేయడమే తప్ప ఇతరుల మాటను ఏ మాత్రం లెక్కపెట్టారు.
వృషభం – అవసరానుగుణంగా వ్యవహరించే వారే తప్ప నిజమైన ప్రేమాభిమానాలు కనబరిచే వారు కరువయ్యారనే భావన కలుగుతుంది. మీ మానసిక పరిస్థితిని సమాజం అర్థం చేసుకోదు. ఏకాంతాన్ని కోరుకుంటారు.
మిథునం – రాజకీయపరంగా తీసుకునే నిర్ణయాల వలన లాభపడగలుగుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. మధ్యవర్తి పరిష్కారాల ద్వారా వివాదాస్పద అంశాలను సానుకూల పరుచుకోగలుగుతారు.
కర్కాటకం – రుణాలకు సంబంధించిన అంశాలు ప్రధానంగా పరిష్కరింపబడతాయి.లలిత కళలలో ప్రాధాన్యత కలిగిన వారికి గొప్ప అవకాశాలు కలిసి వస్తాయి.
సింహం – మీ నిర్లక్ష్యం వలన ముఖ్యమైన చిరునామాలు, సెల్ ఫోన్ నెంబర్లు తాత్కాలికంగా కనబడక ఇబ్బంది కి గురవుతారు. హోదాలను పెంచే ఒకానొక సంస్థల సభ్యత్వాన్ని తీసుకుంటారు. రుణాలు తీరుస్తారు.
కన్య – కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేయడానికి తేదీలను ఖరారు చేసుకుంటారు.సంతాన విషయంలో క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి.
తుల – మీ ప్రణాళికలలో మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవసరాలకు తగినంత ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి.
వృశ్చికం – అనవసరమైన బేషాజాలకు పోరు. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. విద్యాపరమైన విషయాల అనుకూలంగా ఉంటాయి.
ధనుస్సు – ఎక్కువగా శ్రమిస్తారు. శ్రమకు తగిన ఫలితాలను పూర్తిస్థాయిలో అందుకోవడానికి మరి కాస్త సమయం పడుతుంది. ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి ప్రాముఖ్యతను ఇస్తారు.
మకరం – వ్యాపారస్తులకు కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తుంది. కుటుంబంలో స్వల్పమైన అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి.
కుంభం – మీతో ఏకీభవించే వారి సంఖ్య తక్కువగా ఉన్నదని భావిస్తారు. మానసిక ప్రశాంతతను సంతృప్తిని ఎక్కువ పాల్లలో కలిగి ఉండరు. ఇందుకు కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి.
మీనం – రాజకీయాలపైన దృష్టిని సారిస్తారు. ఒత్తిడి నుండి బయటపడడానికి యోగ, మెడిటేషన్ వంటి వాటిని అనుసరిస్తారు. కార్యాలయాలలో పని భారం పెరుగుతుంది. ఆశించిన సెలవులను పొందలేరు.