మేషం – ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్న ఒక వర్గం తిరిగి మళ్లీ చేరువవుతారు. మీ ప్రణాళికలో మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
వృషభం – కుటుంబంలో స్వల్పమైన అనారోగ్య సమస్యలు చోటుచేసుకుంటాయి. మానసిక ప్రశాంతత కొరబడుతుంది నిందలు అపోహలు ప్రచారంలో ఉంటాయి. కొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి.
మిథునం – ఉద్యోగాలపరంగా మీ కృషి శక్తి సామర్థ్యాలు ప్రశంసలకు నోచుకుంటాయి. చేసిన పొరపాట్లు మళ్లీ చేయకుండా జాగ్రత్త వహిస్తారు.స్థిరాస్తులను వృద్ధి చేసుకోవాలని మీ కోరిక నెరవేరుతుంది.
కర్కాటకం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు.
సింహం – సంతానమునకు నూతన విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు.ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు.
కన్య – మీకు సంబంధం లేని సమస్యలలో చిక్కుకుంటారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటి నుండి బయట పడతారు. ఇంట్లో శుభకార్యాలు ప్రస్తావన ఉంటుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.
తుల – మిమ్మల్ని మీరు ఒంటరివారుగా భావిస్తారు. బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ఆర్థిక అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. కలలు నిజమవుతున్నట్టుగా బ్రాంతి కలుగుతుంది.
వృశ్చికం – ఆదాయాన్ని మించిన ఖర్చులను గ్రహ స్థితి సూచిస్తున్నప్పటికీ నేర్పుగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. కంప్యూటర్ వంటి సాంకేతిక పరికరాలను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి.
ధనుస్సు – ప్రతి విషయానికి ఆచితూచి వ్యవహరిస్తారు.ఇష్టానుసారంగా మెలగలేరు. కొంతమందిని నమ్మి భాగస్వామ్య వ్యాపారాలను ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు.
మకరం – విందు వినోదాల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి.
కుంభం – శుభకార్య ప్రయత్నాలలో ముందడుగు వేయగలుగుతారు. నిష్కారమైన ద్వేషానికి కారణాలు అన్వేషించడంలో వైఫల్యం చెందుతారు. సంతాన కుటుంబ వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి.
మీనం – మీ వెనకే ఉంటూ గోతులు తవ్వుతున్న వారిని గుర్తించి వారికి తగిన గుణపాఠం చెబుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది.