Sunday, January 19, 2025

మంగళవారం రాశి ఫలాలు(13-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి.  వ్యాపారాన్ని బహు విధాలుగా విస్తరింప చేస్తారు. పోటీ లేకుండా చూసుకుంటారు.

వృషభం – ఏకాభిప్రాయంతో ఐక్యమత్యంతో అనేక మంచి కార్యక్రమాలు పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది.జీవితంలో నెరవేరవు అనుకున్న ముఖ్య కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు

మిథునం – శుభకార్యాల విషయంలో మానసికంగా భయపడతారు. సంతానానికి ఎలాంటి సంబంధాలు వస్తాయన్న ఆందోళన వెంటాడుతుంది. వాతావరణం మీకు అనుకూలంగా మలుచుకోవడంలో విజయం సాధిస్తారు.

కర్కాటకం – చౌకబారు ఆరోపణలు కోపం తెప్పిస్తాయి. ఆరోపణలకు కారకులైన వారి మీద ప్రతీ కారం తీర్చుకుంటారు. విలువైన స్థిరాస్తులు తక్కువ ధరకు కొనుగోలు చేసి మానసిక సంతోషాన్ని పొందుతారు.

సింహం – ఆత్మీయులు స్నేహ వర్గం, బంధువర్గం దగ్గరవుతారు.చిరునవ్వుల వెనుక దాగిన విషమనస్తత్వాలను గ్రహించలేరు. మిమ్మల్ని మోసపుచ్చాలని చూసిన వ్యక్తులకు  గుణపాఠం చెబుతారు.

కన్య – మీ పరపతి మీకు తెలియకుండానే దుర్వినియోగం అవుతుంది. ఆర్థిక దుర్వినియోగాన్ని మాత్రం ఆపగలుగుతారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం అన్నివేళల మంచిది కాదని గ్రహించండి.

తుల – వాస్తవ పరిస్థితులను బెరీజు వేయడంలో నిర్ణయాలు తీసుకోవడంలో వెనకటి చురుకుదనం చూపిస్తారు. డాక్యుమెంట్స్ లో లోపాలు గుర్తించి నష్టపోకుండా జాగ్రత్త పడతారు.

వృశ్చికం – సంతాన పురోగతికి మీరు చేసే కృషి సక్రమమైన ఫలితాన్ని ఇస్తుంది. విదేశీ సంబంధిత విషయాలు లాభిస్తాయి. చాలాకాలం తర్వాత తెగిపోయిన బంధాలు వ్యక్తులు తిరిగి దగ్గరవుతారు.

ధనుస్సు – నూతన వ్యాపారాలలో పెట్టుబడి కొరకు సక్రమమైన భాగస్వాముల కొరకు వేచి చూస్తారు. జీవిత భాగస్వామి పేరు మీద చేసే వ్యాపారం బాగుంటుంది. మరొక నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

మకరం – జీవితంలో నూతన కోణాలను ఆవిష్కరించాలని ప్రయత్నిస్తారు. ఉన్నచోట నుండి కదలని వ్యక్తుల వల్ల మీరు అనుకున్న పనులు సాధ్యం కావు వాళ్లు మీతో కలిసి రారు. ఒంటరిగా చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి.

కుంభం – కీలక విషయాలలో న్యాయ నిపుణుల సలహాలు అవసరం. ఏ పని చేయలేని మనస్తత్వం నష్టానికి విమర్శలకు కారణం అవుతుంది. శుభకార్యాలు ఘనంగా చేస్తారు.

మీనం – అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పిల్లల ఎడ్యుకేషన్ గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News