Monday, January 13, 2025

శుక్రవారం రాశి ఫలాలు(13-12-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల అభివృద్ధికి మీ వ్యూహరచన ఫలిస్తుంది. మీ ఆలోచనలు కార్యరూపంలో సత్ఫలితాలను కలిగిస్తాయి.

వృషభం – మంచి కార్యక్రమాలను అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. నిర్మాణ సంబంధమైన పనులు అనుకూలిస్తాయి. అందులో పురోగతి బాగుంటుంది.

మిథునం – ఉన్నత స్థాయి వర్గం లోని వారికి మంచి సలహాలను అందిస్తారు. వారి ద్వారా మంచి సలహాదారునిగా పేరు పొందుతారు. మీరు అందరిలోనూ ప్రత్యేకంగా ఉండడం కొందరి అసూయకు కారణం అవుతుంది.

కర్కాటకం – పనులు సాఫీగా సాగుతాయి. స్వప్రయోజనాల కోసం బాగా శ్రమిస్తారు. మొండికి పడిన పనులు సానుకూల పడతాయి. దైవానుగ్రహం ఉంది అని నిరూపించే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి.

సింహం – పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయాలు బలపడతాయి.  భాగస్వాముల నిజాయితీ మీద అపనమ్మకం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు.

కన్య – మీరు నమ్మిన స్నేహితుల పనితీరు మీకు నచ్చదు. అర్థం లేని తగాదాలకు పరిష్కారం కనిపించదు. అనుకూలమైన ఆనందకరమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు.

తుల – అనుకున్న పనులు కష్టం మీద సానుకూల పడతాయి. ఆర్థికపరమైన లాభాలను పూర్తిస్థాయిలో అందుకోవడానికి గాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు.

వృశ్చికం – వివాదాస్పదమైన అంశాలను మరింత జటిలం కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. ప్రత్యేకమైన కారణాలేవి లేకపోయినప్పటికీ వేళ్లకి నిద్రాహారాలు కరువవుతాయి.

ధనుస్సు – సంతాన విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సి వస్తుంది. పొదుపు పథకాలను ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంతవరకు పాటించగలుగుతారు.

మకరం –  శ్రమ అధికంగా ఉండే వర్గాలకు మిమ్మల్ని బదిలీ చేసే సూచనలు ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. దూరప్రాంత విషయ  వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యాన్ని కొంత నిర్లక్ష్యం చేస్తారు.

కుంభం –  వృత్తి ఉద్యోగాల పరంగా అధిక శ్రద్ధను కనబరుస్తారు. బ్యాంకు రుణాలు మంజూరవడంలో జాప్యం  చోటు చేసుకుంటుంది. నూతన ఉద్యోగాన్వేషణ చేపడతారు.

మీనం – నూతన ఆలోచనలు సాగిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచుకుంటారు. ఏకపక్షం అభిప్రాయాలు ఏకపక్ష నిర్ణయాలు లాభించవు. స్వల్ప ధన లాభం గోచరిస్తున్నది.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News