Tuesday, January 14, 2025

మంగళ వారం రాశి ఫలాలు(14-01-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సెల్ఫ్ డ్రైవింగ్, ప్రయాణాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

వృషభం –  ఆర్థికంగా బాగుంటుంది. ప్రయాణంలో ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందకర సమయాన్ని గడపగలుగుతారు. తోటి వారి సహాయం లభిస్తుంది.

మిథునం – ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. మీ రంగంలో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి.

కర్కాటకం – బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదు. మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.

సింహం – ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయకూడదు. చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. నూతన వస్తువులను వస్త్రాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు.

కన్య – కుటుంబ సభ్యుల యొక్క ఆదరాభిమానాలు మీ పై ఉంటాయి. విందులు వినోదాలలో పాల్గొంటారు. దూరపు  బంధువులను కలుసుకుంటారు. దురాలవాట్లకు దూరంగా ఉండాలి.

తుల – కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. కుటుంభంతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

వృశ్చికం –  మానసికమైన ఆనందం ఏర్పడుతుంది. ప్రయాణాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నూతనమైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం.

ధనుస్సు – చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికందుతుంది. కొంత మంది వ్యక్తులతో వాదులాట ఏర్పడే సూచన.

మకరం –  కొన్ని విషయాలలో అనవసరంగా డబ్బు ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి.  ప్రయాణాలలో తొందరపాటు తగదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.

కుంభం –  సెంటిమెంట్ వస్తువుల భద్రతల విషయంలో జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామితో స్వల్పమైన మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం.

మీనం – స్వల్ప ధన వ్యయ సూచన. బంధువులతో స్నేహితులతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News