Wednesday, January 22, 2025

గురువారం రాశి ఫలాలు(14-11-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – మీ గురించి చెడుగా ప్రచారం చేసే వారితో వాదించడం కన్నా వారికి దూరంగా ఉండటం మంచిదని భావిస్తారు. ఆ విధంగానే వ్యవహరిస్తారు. ముఖ్య విషయాలలో సొంత నిర్ణయాలకే ప్రాముఖ్యతను ఇస్తారు.

వృషభం – కుటుంబపరమైన చికాకులు వృత్తి ఉద్యోగాల మీద ప్రభావం చూపించకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. తద్వారా లాభపడతారు. ప్రత్యర్థుల దాడిని నేర్పుగా తృప్తి కొట్టగలుగుతారు.

మిథునం – స్నేహ సంబంధాలను మరింతగా వృద్ధి చేసుకునే విధంగా అడుగులను ముందుకు వేస్తారు.  వివాదాలకు దూరంగా ఉంటారు. మీ పైనున్న గుడ్ విల్ ను నిలుపుకోగలుగుతారు.

కర్కాటకం – బంధువర్గం వారికి ఆర్థిక సహాయం చేయవలసిన స్థితి మీకు తప్పకపోవచ్చు. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన విషయాలలో అజాగ్రత్త తగదు.

సింహం – చిన్నచిన్న అవకాశాలను కూడా చేజార్చుకోరు ముందు జాగ్రత్త లేకపోవడం వలన ఒక సందర్భంలో చిన్నపాటి ఒడిదుడుకులు మాత్రం ఎదుర్కొనవలసి వస్తుంది.

కన్య –  మీ నైపుణ్యమునకు సామర్థ్యానికి తగినటువంటి స్థానమును సంపాదించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి.

తుల – క్షణం వృధా చేయకుండా అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యధాతధంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా స్వల్పమైన ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి వస్తుంది.

వృశ్చికం – ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉంటాయి. గతంలో మీరు చేసిన కృషి ఇప్పుడు సత్ఫలితాలను ఇవ్వడానికి కారణం అవుతుంది. వృత్తిపరంగా లాభాలు పెంపొందుతాయి. కలిగిన దాంట్లోనే తృప్తి పడతారు.

ధనుస్సు – రుణాలను తీర్చి వేస్తారు. ఖర్చులు అధికంగా ఉండటం వలన అవసరాలకు సరిపడా ధనాన్ని సమకూర్చుకోవడానికి ప్రాముఖ్యతను ఇచ్చి ఆ విషయం పైన దృష్టిని కేంద్రీకరిస్తారు.

మకరం – అనుకూల ఫలితాలను సాధిస్తారు. వ్యాపార పరంగా వృత్తిపరంగా మంచి నిపుణతను చూపించగలుగుతారు. వీసా పాస్పోర్ట్ వంటి అంశాలు సానుకూల పడతాయి.

కుంభం – అధికారుల అండదండలు లభిస్తాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహించారని పదిమంది మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. సహోద్యోగులతో స్నేహభావంతో మెలుగుతారు.

మీనం – శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక కుటుంబ విషయముల పురోగతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News