Sunday, January 19, 2025

గురువారం రాశి ఫలాలు(15-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. అనవసరమైన గొడవలలో మీ పేరు లాగే ప్రయత్నం చేస్తారు. మీ పిల్లలపై వచ్చిన దుష్ప్రచారం నిజం కాదని నిరూపించడానికి మీరు అహర్నిశలు శ్రమిస్తారు.

వృషభం – వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నటువంటి రహస్య సమాచారం ఇతరులకు చేరడం. మీ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఇంట్లో వాళ్ళు నిందలు వేయడం కొంత వేదనకు కారణం అవుతుంది.

మిథునం – జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సంతాన సంబంధిత విషయ వ్యవహారాలలో అప్రమత్తత అవసరం.

కర్కాటకం – అనుమానాస్పద వ్యక్తులు తారసపడతారు. వీరి వల్ల కొంత ధన నష్టం వాటిల్లే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇలాంటి వ్యక్తులతో ఇక మీదట జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరమని గ్రహిస్తారు.

సింహం – మీ బాధ్యతల్ని మీరు సక్రమంగా నిర్వహిస్తారు. కొన్ని కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో మీ పనితీరు నచ్చక పై అధికారులు మిమ్మల్ని బదిలీ చేయాలని అనుకుంటారు.

కన్య – కొన్ని విషయాల్లో నిస్వార్ధంగా వ్యవహరించడం కూడా నేరంగా మారుతుంది. సరే ఏదైతేనేం కాలం కలిసి రానప్పుడు పరిస్థితులు ఇలాగే మారుతాయి అని సరిపెట్టుకుంటారు.

తుల – మంచి పనులు చేయడానికి కూడా ఆటంకపరిచే శత్రువర్గం ఉండటం మీ మనో వేదనకి కారణం అవుతుంది. వైరల్ జ్వరాలు. గొంతుకు సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి.

వృశ్చికం – ఉద్యోగాలలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ప్రవర్తన మీకు నచ్చని కారణంగా వ్యాపార వ్యవహారాల్లో వాళ్లను దూరంగా ఉంచుతారు.దీని వల్ల ఆర్థికంగా నష్టం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి.

ధనుస్సు – పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలను వ్యక్తుల యొక్క ప్రవర్తనను వేరువేరుగా చూస్తారు. సమాజంలో ప్రతి విషయం ధనంతో ముడిపడి ఉందని కాస్త ఆలస్యంగా గ్రహిస్తారు.

మకరం – అమ్మకాలకు సంబంధించి ఒప్పందాలు ఖరారు చేసుకునేందుకు అనుకూలమైన కాలం. మీరు ఊహించిన ఆస్తుల విలువ పెరగదు ఊహించని చోట ఆస్తుల విలువ పెరుగుతుంది.

కుంభం – ఉద్యోగంలో వ్యాపార ప్రదేశాలలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. సర్దుకుపోవడమే వివేకం అని గ్రహిస్తారు. కుటుంబ స్థితిని వృద్ధిలోకి  తీసుకురావడానికి విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు.

మీనం – సరైన సలహాదారులు నమ్మకస్తులైన దగ్గర వ్యక్తి దూరం అవడం మీకు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది. ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా అహర్నిశలు శ్రమిస్తారు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News