Sunday, December 22, 2024

శుక్రవారం రాశి ఫలాలు(15-11-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – మీకు దక్కిన ఒక అధికార పత్రం వలన పరోక్షంగా లాభపడతారు. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మిత్రులతో జరిపే సంభాషణలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.

వృషభం – నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఆర్థిక విషయాలకు సంబంధించిన అంశాలు మీకు అనుకూలంగానే ఉన్నాయని భావిస్తారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.

మిథునం – ఉద్యోగ పరంగా మంచి అవకాశం రావడం వల్ల వేరే కంపెనీకి మారాలని ఆలోచిస్తారు. కొన్ని వ్యాపారాలలో మీ షేర్లను తగ్గించుకుంటారు. ముఖ్యమైన బాధ్యతలు మీ చేతికి అప్పగించబడతాయి.

కర్కాటకం – దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. కొత్త కొత్త ఆహార నియమాలు పాటించడం వలన ప్రయోజనం కలుగుతుంది. భూమి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు,

సింహం – ఆర్థిక లావాదేవీలు కొంత అనుకూలంగా ఉంటాయి. కీలక నిర్ణయాలలో మీ ఆలోచనల కంటే జీవిత భాగస్వామి సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.

కన్య – ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు ఏమాత్రం తగదు. బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

తుల – నేర్పు కలిగిన వారిగా పేరు పొందుతారు. పలు రంగాల పట్ల మీకున్న అనుభవం ఉపకరిస్తుంది. ప్రచారంలో ఉన్న పుకార్లను ఎంత మాత్రం పరిగణలోకి తీసుకోరు. దైవ దర్శనం చేసుకుంటారు.

వృశ్చికం – ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలను అమలుపరుస్తారు. మంచి మాటలతో కార్యక్రమాలను ఏ విధంగా జయప్రదం చేసుకోవచ్చనేది అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు.

ధనుస్సు – స్త్రీలతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించండి. వాయిదా పద్ధతులలో కొనుగోళ్ళూ  చేయడానికి ఒప్పందాలనుకుదురుచుకుంటారు. ఊహించని విధంగా అవకాశాలు పొందుతారు.

మకరం – ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విందు- వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

కుంభం – రుణ బాధల నుండి కొంత విముక్తిని పొందుతారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. పుస్తక పఠణం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు.

మీనం – చిన్నపాటి ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. వృత్తి- పరంగా అభివృద్ధి సాధిస్తారు. ఇన్స్టాల్మెంట్స్ కట్టడంలో కొంత జాప్యం ఏర్పడుతుంది.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News