Wednesday, April 16, 2025

బుధవారం రాశి ఫలాలు(16-04-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దేవాలయాలను సందర్శిస్తారు. ఒకానొక విషయంలో తెగించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యాపరంగా నూతన కోర్సులను అభ్యసించే విషయంపై దృష్టిని కేంద్రీకరిస్తారు.

వృషభం – మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మొండిబాకిల వసూలకు గాను మీరు చేసే ప్రయత్నాలు నామమాత్రపు ఫలితాలను ఇస్తాయి.

మిథునం – మీ పరపతిని ఉపయోగించి పనులను సానుకూలపరుచుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొనవలసి వస్తుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు మీకు మేలు కలిగిస్తాయి.

కర్కాటకం – గృహ నిర్మాణ పనులు ఆటంకం లేకుండా సాగుతాయి. వృత్తి- వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

సింహం – విదేశీయాన వ్యవహారాలు సానుకూలపడతాయి. పాస్పోర్ట్ వీసా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.

కన్య – పుకార్లను నమ్మకుండా కంటితో చూసిన విషయాలనే నిర్ధారించుకోండి. న్యాయబద్ధంగా నడుచుకునే మీ నడవడిక వలన లాభపడతారు. స్కిన్ కి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది.

తుల – ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగానే ఉన్నాయి. ఏ పని ఎందుకు చేస్తున్నారో మీకు తప్ప ఇతరులకు తెలియనివ్వరు. కొత్త రంగాలలో అనుభవం సాధించడానికి శ్రీకారం చుడతారు.

వృశ్చికం – విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు పలువురు ప్రశంసించే విధంగా మీ నడవడిక ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శన.

ధనుస్సు – కారణాలు ఏమైనప్పటికీ సన్నిహిత వర్గంతో అభిప్రాయ బేధాలు చోటు చేసుకుంటాయి. సంతానం పైన ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది.

మకరం – కుటుంబ సభ్యులు  సహాయ సహకారాలు అందిస్తారు. ఎంత కష్టించిన ఫలితం నామమాత్రంగా పొందుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు.

కుంభం – జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకొని లాభపడగలుగుతారు.  బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు.

మీనం – అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. పెట్టుబడికి కావలసిన ధనాన్ని ధైర్యం చేసి అప్పు చేస్తారు. రహస్యంగా చర్చలను సాగిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News