Sunday, January 19, 2025

శనివారం రాశి ఫలాలు(16-11-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – వ్యక్తిగత బంధుత్వాలకు అతీతంగా వ్యవహరించండి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. ఇంటా బయట సమస్యలు ఎదురైన అధిగమిస్తారు.

వృషభం – సంతానం కోసం అధికంగా ఖర్చు చేస్తారు. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన పెట్టుబడులకు తొందరపాటు తగదు.

మిథునం – వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి మధ్యస్థంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయడానికి విఫలయత్నం చేస్తారు.

కర్కాటకం – నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘ సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్నేహితులతో సన్నిహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.

సింహం – విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. లిఖితపూర్వక ఒప్పందాలు జరగవలసిన చోట మౌఖిక ఒప్పందాలతో సరిపెట్టుకోన వలసి వస్తుంది. వ్యాపారాభివృద్ధి ఆశాజనకంగా ఉంటుంది.

కన్య – రుణ బాధల నుండి విముక్తిని పొందుతారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు తీరుతాయి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం.

తుల – ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు

వృశ్చికం – వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు.  భాగస్వామ్య వ్యాపారాలను విస్తరింప చేయడానికి తగిన విధంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు.

ధనుస్సు – నూతన పనులకు శ్రీకారం చుడతారు. కోర్టు తీర్పులు వాయిదా పడతాయి. రుణ వత్తిడుల నుండి బయటపడతారు. మిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు ఏర్పడే సూచనలు ఉన్నాయి.

మకరం – ప్రయాణాలు లాభిస్తాయి. శుభవార్తలు వింటారు. చర్చ గోస్టులలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.

కుంభం – క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఓ వార్త వలన ఆనందం కలుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు.

మీనం – వృత్తి ఉద్యోగాలలో ఏర్పడిన ఆటంకాలు తొలుగుతాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాల మంచిది. ఆభరణాలను నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News