మేషం -భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరుస్తారు. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.దూర ప్రాంత ప్రయాణాలులాభిస్తాయి.స్వల్ప ధన లాభం.
వృషభం -ఆర్దిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు పదోన్నతులు పొందుతారు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
మిథునం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ చెల్లింపులను సకాలంలో చెల్లించలేరు. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన మార్పులేవి ఉండవు. దైవ చింతన కలిగి ఉంటారు.
కర్కాటకం -ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలకు గాను మీరు చేసే విదేశీయన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కోటి విద్యలు కూటి కోసమేనని అభివృద్ధి కోసం అనేక విధాల ప్రయత్నం చేస్తారు. కొంత ధన నష్టం సూచన.
సింహం -ఆర్థికంగా ఉన్నతిని సాధించడానికి గాను ఈజీమని వైపు మొగ్గు చూపుతారు. ఇది లాభించే అంశం కాదు. ఉపయుక్తంలో లేని సంభాషణలు చర్చలకు ఏమాత్రం తావివ్వరు. మానసిక ఆనందం ఏర్పడుతుంది.
కన్య – కుటుంబాన్ని అభివ్రుద్దిలోకి తీసుకురాడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు.మొండిబాకిలు కొంతమేర వసూలు అవుతాయి.తనఖా వస్తువులను విడిపిస్తారు.మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు.
తుల -గృహం కొనుగోలు చేయాలన్న ఆలోచన లు బలపడతాయి. పని భారం వలన ఒత్తిడికి లోనవుతారు. ముఖ్యమైన డైరీ సకాలంలో కనపడక తాత్కాలికంగా చికాకు పడతారు.
వృశ్చికం -అతి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరకు పూర్తి చేస్తారు, దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. విందు వినోదాలు శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.
ధనుస్సు -మిత్ర వర్గం,ఆత్మీయ వర్గం అన్ని విధాల సహకరిస్తారు. ఉన్నతస్థాయి వర్గం వారి అండదండలు లభిస్తాయి. శుభప్రదమైన ప్రసంగాలు చర్చలు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి.
మకరం -ప్రముఖుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రకృతి వైద్యం, యోగా వంటి సనాతన ఆరోగ్య సూత్రాల పట్ల ఆకర్షితులవుతారు.
కుంభం -సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ప్రతి విషయంలో సానుకూల ఫలితాలను సాధిస్తారు
మీనం -దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. విదేశీయాన యత్నాలు కలిసి వస్తాయి.రెండు పడవల మీద ప్రయాణం శ్రేయస్కరం కాదని తెలిసినప్పటికీ, ప్రయోజనాలను పరీక్షించుకోవడానికి గాను ఇటువంటి వ్యవహారాలు తప్పనిసరిగా పరిణమిస్తాయి.