Sunday, April 20, 2025

గురువారం రాశి ఫలాలు(17-04-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – కర్త, కర్మ, క్రియ, అన్ని మీరే అయ్యి సంస్థను ముందుకు నడిపిస్తారు. ఆరోగ్య సూత్రాలకు ప్రాధాన్యతని ఇస్తారు. నూతన వస్తు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

వృషభం – భాగస్వామ్య వ్యాపారాలను విస్తరిస్తారు. కుటుంబ సభ్యుల సలహాల మేరకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. సాంస్కృతి కార్యక్రమాల్లో పాల్గొంటారు అనుకోని అతిధుల నుండి ఆహ్వానాలు అందును.

మిథునం – చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపార పరంగా స్వల్ప లాభాలు పొందుతారు. కీలకమైన వ్యవహారాలలో సాంకేతికపరమైన లోపాలు చోటు చేసుకుంటాయి.

కర్కాటకం – తీరవు అనుకున్న సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

సింహం – గృహ నిర్మాణ పనులు ఆటంకాలు లేకుండా జరగడం మీ సంతోషానికి కారణం అవుతుంది.  ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

కన్య – ఉద్యోగులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు.  క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు గడిస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాల మంచిదని గ్రహిస్తారు.

తుల – రాజకీయాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. మధ్యవర్తి సంతకాలు ఏమాత్రం కలిసి రావు. వీసా పాస్పోర్ట్ వంటి అంశాలు సానుకూలపడతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం – సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. నూతన పనులకు శ్రీకారం చుడతారు. తోటలు వ్యవసాయ భూములు కొనుగోలు దాదాపుగా ఖాయం అవుతాయి. ఆరోగ్యం పట్ల కొంత మెలకువ అవసరం.

ధనుస్సు –  వృత్తి- వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు.

మకరం – జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. వాటిని అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలపరంగా మీ స్థాయి పెరుగుతుంది.

కుంభం – ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికపరమైన లాభాలను పూర్తిస్థాయిలో అందుకోవడానికి గాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు.

మీనం – ఒక సమస్య తీరితే మరో సమస్య కొత్త కోణం తారసపడుతుంది. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి అనుకొని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగ పరుచుకోండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News