Saturday, January 18, 2025

శనివారం రాశి ఫలాలు(18-01-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – మీ ఊహలు అంచనాలు పూర్తిస్థాయిలో కాకపోయినా కొంతవరకు సఫలం అవుతాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సాంకేతిక కారణాల వలన ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంది.

వృషభం –  పరిస్థితులకు అవసరాలకు సంబంధించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. బంధువులతో ఏకాభిప్రాయం సాధించి ఎంతో కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించ గలుగుతారు.

మిథునం – ఆర్థిక సమస్యలు చికాకు కలిగిస్తాయి. జరగవు అనుకున్న శుభకార్యాలు ఆకస్మికంగా ముడి పడతాయి. కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పు పొందగలుగుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

కర్కాటకం – మీ యొక్క రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది.

సింహం – బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ఆర్థిక అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. మొండికి పడిన పనులలో కదలిక ఏర్పడుతుంది. ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి.

కన్య – వృత్తిలో పురోగతి సాధిస్తారు.వ్యాపార పరంగా అనుకున్న విధంగా మార్పులు చేర్పులు చేస్తారు. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి.

తుల – వృత్తి- వ్యాపారాల పరంగా సాధారణ ఫలితాలు అందుకుంటారు. అవసరాలకు సరిపడదనాన్ని సమకూర్చుకోగలుగుతారు. కొనుగోలు అమ్మకాలు అనుకూల వాతావరణంలో ఉంటాయి.

వృశ్చికం – కార్యాలయంలో పని భారం అధికంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ సంతృప్తి చెందరు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి.

ధనుస్సు – ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నడుచుకుంటారు. వృత్తి ఉద్యోగాలపరంగా సంతృప్తికరమైన ఫలితాలు. కీలకమని భావించిన అంశాలలో తొందరపాటు చేయకూడదు.

మకరం –  వృత్తి- వ్యాపారాలపరంగా సాధారణ ఫలితాలు ఉంటాయి. దూరప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో విభేదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ధన వ్యయ సూచన కనిపిస్తుంది.

కుంభం –  మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. వివాదాస్పద అంశాలను పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థికస్థితి మెరుగ్గా ఉంటుంది. శుభ సమాచారాన్ని అందుకుంటారు.

మీనం – ఉద్యోగ- వ్యాపారాల పరంగా లాభపడతారు. ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాల్లో తొందరపాటు తగదు. స్వల్ప ధన లాభ సూచన.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News