మేషం – ఆదాయ వ్యయాలలో సమతుల్యతను సాధించడానికి గాను మీరు చేసే కృషి నామం మాత్రం ఫలితాన్ని ఇస్తుంది. వాయిదా చెల్లింపు పద్ధతిలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకుంటారు.
వృషభం – ప్రతిబంధకాలను అధిగమించి మీ పనులను సానుకూల పరచుకోగలుగుతారు. కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందగలుగుతారు.
మిథునం – ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా స్వయంకృషితో వాటిని ఎదుర్కొనగలుగుతారు ఇంటి విషయాలపై అధిక శ్రద్ధను చూపుతారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు.
కర్కాటకం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. కొన్ని రుణాలను తీర్చి వేయగలుగుతారు.
సింహం – మిత్రులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు.
కన్య – శ్రమ అధికంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. శుభవార్తలు వింటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపగలుగుతారు.
తుల – కొన్ని కొన్ని విషయాలలో మీ వంతుగా కొంత ధన సహాయాన్ని ఇతరులకి అందించగలుగుతారు. అనుకోని అతిధుల నుండి కీలక సమాచారం అందుకుంటారు.దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి.
వృశ్చికం – శ్రమకు తగిన ఫలితం కష్టమే. పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఉద్యోగులకు కఠిన సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
ధనున్సు – పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
మకరం – వృత్తి-ఉద్యోగాలలో కొంత వర్క్ ప్రెజర్ ఉంటుంది. గృహ నిర్మాణం ఆలోచనలు ఆచరణలో పెడతారు. పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.
కుంభం – అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి- వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి.
మీనం – క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు గడిస్తారు. కొత్త కార్యక్రమాలు మొదలు పెడతారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.