Tuesday, March 18, 2025

మంగళ వారం రాశి ఫలాలు(18-03-2025)

- Advertisement -
- Advertisement -

మేషం -ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణ బాధలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. కొన్ని విషయాల్లో గట్టి పోటీ ఎదుర్కొంటారు.

వృషభం -భాగస్వామ్య వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురైనప్పటికి అధిగమించి ముందుకు సాగుతారు.  భూముల క్రయవిక్రయాలలో తగిన ప్రోత్సాహం లభిస్తుంది. రుణాలను కొంతవరకు తీరుస్తారు.

మిథునం -వృత్తి ఉద్యోగాలపరంగా సంతృప్తికరమైన ఫలితాలు.శుభకార్యాలకు సంబంధించిన చర్చలు పురోభివృద్ధిలో ఉంటాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు మీకు మేలు కలిగిస్తాయి.

కర్కాటకం -శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. రెండు మూడు విధాలుగా ఆర్థిక లాభాలు ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అవి మీకు ఉపకరిస్తాయి.

సింహం -ఉద్యోగులు కొంత సమస్యలు ఎదుర్కొన్న ఇష్ట దైవ ప్రార్థన మేలు చేస్తుంది. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్వల్ప జాగ్రత్తలు అవసరం.

కన్య -దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.స్వల్ప ధన లాభ సూచన గోచరిస్తుంది.

తుల -ఎంతో కాలంగా దూరంగా ఉన్నటువంటి బాల్య స్నేహితులు తిరిగి పరిచయం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇది మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది.

వృశ్చికం -మాటలవరకే  మీ కోపాన్ని పరిమితం చేసి లాభపడతారు. సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అమలుపరచడానికి కావలసిన సహచర సిబ్బందిని సమకూర్చుకుంటారు. అన్ని విషయాలు అనుకూలం.

ధనుస్సు -విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసిక వేదనకు ఏమాత్రం తావివ్వరు. ఆర్థిక అభివృద్ధి అనుకున్న విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు.

మకరం -సన్నిహితులతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కరించుకుంటారు. మీరు కుదుర్చుకునే అగ్రిమెంట్స్ కలిసి వస్తాయి. ఆదాయ వ్యయాలలో సమతుల్యత ఏర్పడుతుంది.

కుంభం -చాలా వరకు మీ అంచనాలు నిజమవుతాయి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కుటుంబ పురోభివృద్ధి బాగుంటుంది. ఉన్నతాధికారుల మెప్పును పొందగలుగుతారు.

మీనం -కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొనుగోలు అమ్మకాలు సాగిస్తారు.అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండిబరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News