Monday, April 21, 2025

శనివారం రాశి ఫలాలు(19-04-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – దూరప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

వృషభం – వివాదాలు తీరి మానసిక ప్రశాంతతను పొందుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్థావన  ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను చేపడతారు.

మిథునం – నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చి నూతన వ్యాపారాలను ప్రారంభించే సూచనలు ఉన్నాయి. స్వయంకృతాపరాదాలు చోటుచేసుకుంటాయి.

కర్కాటకం – అటు వృత్తి ఉద్యోగాల విషయంలో గాని, ఇటు కుటుంబ వ్యవహారాలలో గాని శారీరకంగా మానసికంగా శ్రమిస్తారు ఒత్తిడికి లోనవుతారు.

సింహం – అనతి కాలంలో ప్రారంభించబోయే వ్యాపారాల నిమిత్తం నిర్వహించవలసిన శుభకార్యాల నిమిత్తం కావలసిన వనరులను సమకూర్చుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య –  బంధువర్గంతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. ఎంతగానో శ్రమించి వ్యయప్రయాసలు కోర్చి ఓ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు. ధనం అధికంగా ఖర్చవుతుంది.

తుల – విద్యార్థిని విద్యార్థులు మరింత శ్రద్ధను కనబరిచవలసి ఉంటుంది. నిర్మాణ సంబంధమైన విషయాలు స్పెక్యులేషన్ కు సంబంధించిన విషయాలలో ఆచితూచి వ్యవహరించండి.

వృశ్చికం – కుటుంబ సమస్యల పైన దృష్టిని సారిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు.

ధనుస్సు – గత అనుభవముల వలన కొన్ని సమస్యల నుండి మీరు నేర్పుతో బయటపడతారు. కళా సాహిత్య సినీ రంగాల వారికి అనుకూలం శుభలేఖలను అందుకుంటారు.

మకరం – సంతానం యొక్క విద్యా విషయంపై దృష్టిని కేంద్రీకరిస్తారు. నిర్మాణపు పనులలో వేగం కనబడుతుంది. మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు కొన్ని అవార్డులు లభించవచ్చు.

కుంభం – మీరు చేసే దర్యాప్తులో కొన్ని ముఖ్య రహస్యాలు తెలుస్తాయి. తీర్థయాత్రలు చేసే సూచనలు ఉన్నాయి. శుభకార్యానికి సంబంధమైన విషయాలకు గాను ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది.

మీనం – విదేశీ ఉద్యోగ విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం వలన గత స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఇంట్లోశుభకార్యాల ప్రస్తావన ఉంటుంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News