Sunday, January 19, 2025

గురువారం రాశి ఫలాలు(19-12-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – మీ ఉన్నతిని చూసి ఓర్వలేని వారు అధికంగా ఉంటారు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. రాజకీయ, కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి.

వృషభం –  క్రయవిక్రయాలలో లాభాలు పొందగలుగుతారు. కాంట్రాక్టులు అతి కష్టం మీద దక్కుతాయి.  ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా నిదానంగా పూర్తి చేయగలుగుతారు.

మిథునం – సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి.  ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

కర్కాటకం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణ బాధలు తప్పవు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెంపొందించుకుంటారు.

సింహం – ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు.

కన్య – క్రయవిక్రయాలలో లాభాలు పొందగలుగుతారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. పాత బాకీలను కొంతవరకు తీర్చగలుగుతారు.

తుల –  స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూల పడతాయి. వృత్తి- ఉద్యోగాల పట్ల పురోభివృద్ధిని సాధించగలుగుతారు. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి.

వృశ్చికం – ముఖ్యమైన బాధ్యతలు మీ చేతికి అప్పగించబడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. కొత్త కొత్త ఆహార నియమాలు పాటించడం వలన ప్రయోజనం కలుగుతుంది.

  ధనుస్సు – ముఖ్య విషయాలలో సొంత నిర్ణయాలకే ప్రాముఖ్యతను ఇస్తారు.  కుటుంబపరమైన చికాకులు వృత్తి- ఉద్యోగాల మీద ప్రభావం చూపించకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు.

మకరం – జరగవు అనుకున్న కార్యక్రమాలు ఆకస్మికంగా ముడి పడతాయి.  ఆరోగ్యాన్ని ఓ గాడిలో పెట్టగలుగుతారు. వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండాలని భావిస్తారు.

కుంభం – మీ శ్రమకు తగినటువంటి ఫలితాలు కొంతమేరకు మాత్రమే మీ చేతికి అందుతాయి. అనుకున్న పనులు నిదానంగా పూర్తి అవుతాయి. సాంకేతిక రంగంలోని వారికి ఒడిదుడుకులు సూచిస్తున్నాయి.

మీనం – చేపట్టిన కార్యక్రమాలు అభివృద్ధి సంతృప్తికరంగానే ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాలలో మీరు కోరుకున్న పురోగతి లభిస్తుంది. వివాహపరంగా శుభవార్తను అందుకోగలుగుతారు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News