మేషం -వృత్తి ఉద్యోగ వ్యాపారాలపరంగా పురోభివృద్ధిని సాధిస్తారు. ఊహించని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. స్థిరాస్తి వివాదాలు సమసిపోతాయి.
వృషభం -మానసిక ప్రశాంతత లభిస్తుంది. వాహన స్థలాలు కొనుగోలుయత్నాలు అనుకూలిస్తాయి.ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పారిశ్రామిక విద్యా రంగాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది.
మిథునం -క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఎంత కష్టపడినా ఫలితం నిదానంగా పొందుతారు. కొన్ని విషయాలలో నిదానంగా ఉండటం కూడా మంచిది అని గ్రహిస్తారు.
కర్కాటకం -ఆర్థిక పరిస్థితి లాభసాటిగా సాగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో బంధువుల సహాయం పొందుతారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు.
సింహం -పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.ఆర్థిక పరిస్థితి అనుకున్న విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.
కన్య -సన్నిహితుల సహాయంతో నూతన వ్యాపారాలు మొదలు పెడదామని ఆలోచనలు కొనసాగిస్తారు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునేలా మీ ఆలోచనలు ఉంటాయి. స్వల్ప ధన లాభం.
తుల -విద్యా , పారిశ్రామిక సాంకేతిక రంగాలలోని వారికి పై అధికారుల నుండి ఆహ్వానాలు అందుతాయి, వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందగలుగుతారు.చేస్తున్న పనులలో కాలయాపన అంతరిస్తుంది.
వృశ్చికం -వాహనాలు భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు.
ధనుస్సు – ప్రముఖుల నుండి ఆహ్వానాలు కీలక నేతలతో తొందరపాటు నిర్ణయాలు వద్దు. చర్చ గోస్టులలో చురుకుగా పాల్గొంటారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు.
మకరం -మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం చేతికి అంది వస్తుంది. ప్రయాణాలలో కొత్త మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు.
కుంభం -ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులను కలిసి ఆహ్లాదంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. రుణాలు తీరి కొంత ఊరట చెందుతారు.
మీనం -ముఖ్యమైన వ్యవహారాలలో ఏ తొందరపాటు నిర్ణయాలు కూడా చేయరు. కీలక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు.తొందరపాటు తగదు. కోపతాపాలకు వివాదాలకు దూరంగా ఉండండి.