Thursday, December 19, 2024

మంగళవారం రాశి ఫలాలు(20-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. వీలైనంతవరకు వివాదాలకు వివాదాస్పద వ్యాఖ్యలకు, చర్చలకు దూరంగా ఉండండి.  మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు.

వృషభం – ప్రతి విషయం కూడాను మీకు తెలియకుండా జరగకూడదు. అన్నీ కూడా నా నిర్ణయం ప్రకారమే జరగాలి అనే ధోరణి మీలో ఏర్పడుతుంది. అధికారులతో మంతనాలు రాజకీయ పైరవీలు లాభిస్తాయి.

మిథునం – వ్యాపార వ్యవహారాలలో అయిన వాళ్లను బంధువులను దూరంగా ఉంచి లాభపడతారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.ఆర్థిక ప్రయోజనాలను బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు.

కర్కాటకం – ఆప్యాయతలు, ప్రేమలు, స్నేహాలు ఇవి ధనం ముందు పని చేయవని తెలుసుకుంటారు. ప్రతి విషయం ధనంతో ముడిపడి ఉందని తెలుసుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తారు.

సింహం – కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. విద్యా సంబంధమైన విషయాలకు అధికంగా ధనం ఖర్చు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి.

కన్య – మీ పెద్దలపరంగా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. వ్యాపారంలో చేసిన నూతన మార్పుల వలన మంచి ఫలితాలు అందుకోగలుగుతారు.

తుల – ప్రైవేటు సంస్థల్లో పెట్టిన డబ్బు, చీటీలు ఫైనాన్స్ సంస్థలలో పెట్టిన డబ్బు తిరిగి పొందే విధంగా ప్రణాళిక నేర్పరచుకుంటారు. మీ స్నేహితులు, సన్నిహితులు రాజకీయ పదవుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నిస్తారు.

వృశ్చికం – ప్రతిష్టాత్మకమైన సంస్థల లో పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. ప్రతి విషయంలోనూ ప్రతి రంగంలోను గట్టి పోటీ ఎదుర్కొనవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించండి.

ధనుస్సు – ఆహార ధాన్యాల వ్యాపారం చేసేవారికి బాగుంటుంది. వ్యవసాయ సంబంధమైన విషయాలు లాభాలు అయోమయంగా ఉండే పరిస్థితి గోచరిస్తుంది.

మకరం – సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు ఆకస్మికంగా లాభిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. బరువు బాధ్యతలు తీర్చుకోగలిగామని సంతృప్తి కలుగుతుంది.

కుంభం – ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రమోషన్ లభించే విధంగా ఉంటుంది. కొన్నాళ్లుగా ఉద్యోగంలో ఉన్న అసంతృప్తి వాతావరణం అలాగే కొనసాగే పరిస్థితి సూచిస్తుంది.

మీనం – కార్యాలయాలలో మీ పనితీరు కొంతమందికి నచ్చకపోవచ్చు. ఉద్యోగం చేయడం కత్తి మీద సాముగా తయారవుతుంది. మీరు చేసే పని ఒకరికి మంచి అనిపిస్తే పదిమందికి చెడు అనిపిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News